వైసీపీకి షాక్: బాలయ్య సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ సహా కౌన్సిలర్లు టీడీపీలోకి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తోపాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డుల్లో 30 మంది వైసీపీ నుంచి కౌన్సిలర్లుగా విజయం సాధించారు.
వైసీపీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరినట్లు హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తెలిపారు. త్వరలో మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఛైర్ పర్సన్ పదవి కూడా టీడీపీ ఖాతాలో పడినట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆరుగురు ఉండగా, బీజేపీ నుంచి ఒకరు, ఎంఐఎం కౌన్సిలర్ ఒకరు గతంలోనే టీడీపీలో చేరారు. తాజాగా, పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి మెజార్టీ బలం చేకూరినట్లయింది.
చిన్నారుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న బాలయ్య❤️
— manabalayya.com (@manabalayya) August 15, 2024
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో స్వాతంత్ర దినోత్సవ
వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి చిన్నారుల మధ్య స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఎందరో మహానుభావుల… pic.twitter.com/Prj0gQReIg
చిన్నారుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న బాలయ్య
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్పత్రి చైర్మన్, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారుల మధ్య స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వీట్లు స్వయంగా పంపిణీ చేశారు బాలయ్య.












Click it and Unblock the Notifications