ఏటీఎం నుంచి నగదు చోరీ హోంగార్డ్, అరెస్టు (ఫోటో)

విశాఖపట్నం: వేరే వ్యక్తి ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేసిన హోం గార్డును సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఏడీసీపీ ఎస్. వరదరాజులు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

విజయనగరం జిల్లా, పార్వతీపురం, వైఎంకే నగర్‌కు చెందిన కర్రి సోమేశ్వరరావు గత ఏడాది మహారాణిపేటలోని సాగర్ దుర్గా మెడికల్స్‌లో మందులు కొనుగోలు చేస్తుండగా ఏటీఎం కార్డు పడిపోయింది. ఆ కార్డు తాడివీధికి చెందిన బుడుమూరి అనిల్ బాబు నే హోంగార్డుకు దొరికింది.

Home guard thefts money in home at Visakhapatnam

కార్డు వెనుక పిన్ నెంబర్ రాసి ఉండటంతో గొల్లలపాలెం ఎస్‌బీఐ ఈ కార్నర్ నుంచి నాలుగు సార్లు రూ. 20 వేలు డ్రా చేశారు. కార్డు పోగొట్టుకున్న కర్రి సోమేశ్వరరావు మొబైల్‌కు మేసేజ్‌లు వచ్చాయి. విషయం తెలుసుకున్న బాధితుడు పార్వతీపురం ఎస్‌బీఐ బ్యాంకు అధికారులను సంప్రదించి ఏటీఎం కార్డును బ్లాక్ చేయించాడు.

ఆ తర్వాత మహారాణి పేట జోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసును సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైం సీఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి సీసీ పుటేజిల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

Home guard thefts money in home at Visakhapatnam

సోమవారం ఉదయం నిందితుడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏటీఎం నుంచి బయటకు వస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏడీసీపీ ఎస్.వరదరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం కార్డు వెనుక పిన్ రాయవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+