మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత..
ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. హోంమంత్రి శ్రీశైలం పర్యటనకు బయల్దేరి వెళ్తుండగా.. మార్గం మధ్యలో నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ దగ్గర జరిగిన ప్రమాదాన్ని గమనించారు. వెంటనే మంత్రి అనిత తన కాన్వాయ్‌ను అపి బాధితులను పరామర్శించారు. వెంటనే ఆమె గాయపడిన యువతి దగ్గరకు వెళ్లి సహాయం చేశారు.
యువతికి మంచి నీరు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మంత్రి శ్రీశైలం వెళ్లారు. ప్రమాదం విషయాన్ని గమనించి బాధితులకు సహాయం చేసిన మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆరుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. ఈ కమిటీలో మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
ఆపద అంటే క్షణం ఆగదు అమ్మతనం
— Anitha Vangalapudi (@Anitha_TDP) February 10, 2025
మానవత్వానికి మరోరూపం ఆమె దయాగుణం
అందుకే అనితమ్మకు అందుతోంది జన నీరాజనం#RoadAccident #VangalapudiAnitha #HomeMinisterAnitha #Humanity #Narasaraopeta #AndhraPradesh #SrisailamTour pic.twitter.com/YBSQgIR6BB
ఇక ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. స్వామి, అమ్మవార్లకు చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం మల్లన్నకు మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించేవారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అందించనుండడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications