Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులకు హోం మినిస్టర్ వంగలపూడి అనిత మాస్ వార్నింగ్.. ఆ హత్యకేసులు రీఓపెన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రిగా వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఇక వంగలపూడి అనిత కూడా హోం మంత్రిగా పని మొదలు పెట్టేశారు. హోం మంత్రిగా అవకాశం ఇవ్వటంపై స్పందించిన అనిత పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని ఆమె వెల్లడించారు.

పోలీస్ అధికారులకు హోం మంత్రి అనిత వార్నింగ్
చంద్రబాబు పాలన అంటే శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో ఉంటాయని నమ్మకం ప్రజల్లో ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానన్నారు . అంతే కాదు కొంతమంది పోలీస్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన వంగలపూడి అనిత, కచ్చితంగా మారాలని మార్పు లేకపోతే తాము మారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక గత పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై హింస కొనసాగిందని పేర్కొన్న వంగలపూడి అనిత ఇకపై మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.

Home Minister Vangalapudi Anitha mass warning to AP police says those murder cases will be reopened

ఆ హత్య కేసులు రీ ఓపెన్ చేయిస్తాం
మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగవచ్చని వ్యాఖ్యానించారు వంగలపూడి అనిత. మాచర్లలో చంద్రయ్య వంటి వారి హత్య కేసులను రీఓపెన్ చేస్తామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హెచ్చరించారు. గతంలో వైసిపి హయాంలో తెలుగుదేశం పార్టీ నేతల పైన పెట్టిన అక్రమ కేసుల పైన సమీక్ష తప్పనిసరిగా ఉంటుందని, ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు కూడా స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.

చంద్రబాబు అవమానాన్ని గుర్తు చేసిన అనిత
అంతేకాదు ఇదే సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ వేదికగా కించపరిచారని మండిపడిన వంగలపూడి అనిత, ఈ సంఘటనతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేశారు. ఆయన కన్నీటితో రాష్ట్రంలో ఒక ఉప్పెన వచ్చిందని రాజకీయంగా ప్రజలు ఇటువంటి ఫలితాన్ని అందుకే ఇచ్చారని వంగలపూడి అనిత తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన
చంద్రబాబు పాలన కావాలని కోరుకున్న ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణ బాగుండాలని ఆయనకు పట్టం కట్టారని పేర్కొన్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ని ఏ విధంగా హత్య చేశారో చూశామని, విశాఖలో వారి కుటుంబ సభ్యులను కూడా వెళ్లి కలుస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు టిడిపి కార్యకర్తలు, నేతలు, మహిళలు, సామాన్యులు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు.

శాంతి భద్రతలను పరిరక్షిస్తాం
తనకు కీలకమైన హోంశాఖను అప్పగించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలకు తన వంతుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ తన తక్షణ కర్తవ్యం అని, తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని వంగలపూడి అనిత తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+