అడవిలో రోజంతా చంద్రబాబు..! గిరిజనులతో మమేకం..అరకు కాఫీతో ఉల్లాసం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాడేరు ఏజెన్సీలో గిరిజనులతో కలిసి ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఏజెన్సీకి వెళ్లిన చంద్రబాబు రోజంతా అడవిలో కలియ తిరుగుతూ ఆదివాసీలతో గడిపారు. ఈ సందర్భంగా వారి జీవన స్దితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడే అరకు కాఫీ తాగారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
ఉదయం పాడేరు మండలం, వంజంగిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు.

గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉత్పత్తుల విక్రయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ జరిగేలా చూడాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు సంబంధించి మరింత మార్కెటింగ్ వచ్చేలా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం కల్పించేలా చేసే అంశంపై ఆలోచన చేయాలని చెప్పారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మరింత ప్రొత్సాహమివ్వాలని చంద్రబాబు సూచించారు. అలాగే గంజాయి సాగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారుల్ని అడిగారు. త్వరలోనే జీరో గంజా ప్రాంతంగా ప్రకటిస్తామని వారు తెలిపారు.


సెరీకల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. నిఫ్ట్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్ వచ్చేలా చేయవచ్చని సూచించారు. ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం మంచి భాగస్వాములను అన్వేషించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీలో నేసిన ఓ చీరను కొనుగోలు చేశారు. స్టాల్లో డ్వాక్రా మహిళ ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టార్ సందర్శించి కాఫీ సేవించారు. అలాగే ఆమెకు ఆదాయం ఎంత వస్తుందని అడిగిన ముఖ్యమంత్రి.. కుకీస్, మిల్లెట్ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకుతో చాక్లెట్ల తయారీ మీద కూడా దృష్టి సారించాలన్నారు.












Click it and Unblock the Notifications