మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ ఎలా ఉందంటే..?
ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడునున్నాయి. ఈక్రమంలో పార్టీల అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మ్యానిఫెస్టో కోసం సామాన్య ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఎంతో అతృతుగా ఎదురు చూశారు.
ఇదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల జాప్యం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. ఈసారి అంతకు మించి సంక్షేమం ఉంటుందని అంతా భావించారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు. గత మ్యానిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో కొత్త మ్యానిఫెస్టోను ప్రకటించారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణమాఫీ ఉంటుందని చాలామంది భావించారు. అయితే జగన్ వాటి ప్రస్తావనే తీసుకురాలేదు. వాస్తవానికి మ్యానిఫెస్టో ప్రకటనకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉంది. కానీ ప్రకటించాక మరోలా ఉందనే మాట వినిపిస్తోంది. మ్యానిఫెస్టో విడుదల తర్వాత వైసీపీలోనే ఒక రకమైన చర్చ సాగుతుంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో కూడా అంతంత మాత్రంగానే ఉండటం వైసీపీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు.
బీజేపీ సైతం ఈ ఉమ్మడి మ్యానిఫెస్టోకు దూరంగా ఉండటం కూటమికి ఇబ్బందికరంగా మారింది. మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికి..పథకాలన్నింటికి కూడా వ్యయాన్ని పెంచడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు జగన్ అమలు అయ్యే హామీలు మాత్రమే ఇచ్చారని.. చేయలేని హామీలను జగన్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టే జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా తాము దొంగ హామీలు ఇవ్వలేదని..ప్రజలు కచ్చితంగా జగన్ వైపే ఉన్నారని..అధికారంలోకి వచ్చేది తామే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications