రైల్వే ఛార్జీని ఎలా లెక్కిస్తారో తెలుసా?
మీరు ప్రయాణించే రైలు ఛార్జీని ఎలా లెక్కిస్తారో తెలుసా? ఏ ప్రాతిపదికన రైలు టికెట్ల ధరను నిర్ణయిస్తారు? దేని ఆధారంగా ఛార్జీ లెక్కిస్తారు? అనే విషయాలను తెలుసుకుందాం. దేశం చివరి నుంచి మొదలు వరకు కలిపే ఏకైక ప్రయాణ సాధనం రైలు, రోడ్డు మార్గం, వాయుమార్గంకన్నా చాలా చవకైన రవాణా సాధనం. శతాబ్ది రైళ్లకు ఛార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. రాజధాని, సూపర్ ఫాస్ట్, మెయిల్, వందేభారత్.. లాంటి రైళ్లకు ఛార్జీలు మారుతుంటాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి, రిజర్వేషన్ ఛార్జీ, జీఎస్టీ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని టికెట్ ధరను నిర్ణయిస్తారు.
రైలు ఛార్జీల గణనలో కిలోమీటర్ అంశం కీలకమైంది. ప్రయాణించాల్సిన దూరం ఎంతనేదాన్ని బట్టి ఇవి ఆధారపడివుంటాయి. 1 5, 6 10, 11 15, 16 20, 21 25, 4,951 5,000 కిలోమీటర్ల కేటగిరీలుగా విభజిస్తారు. రైలు ఛార్జీల పూర్తి వివరాలు రైల్వే వెబ్ సైట్ లో ఉన్నాయి. కావాలనుకుంటే అక్కడి నుంచి ఛార్జీల వివరాలను పరిశీలించవచ్చు. భారతీయ రైల్వే వెబ్ సైట్ లో రైల్వే బోర్డు విభాగంపై క్లిక్ చేసి కోచింగ్ విభాగంలో ఉన్న ఛార్జీల వివరాలను తెలుసుకోవచ్చు.

బస్సు, టాక్సీ, ఇతర పబ్లిక్ రవాణా ఛార్జీలతో పోలిస్తే.. రైలులో ప్రయాణించడం చాలా చౌక. టోల్గేట్, పెట్రోల్ పేరుతో ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు లక్నో నుంచి ఢిల్లీకి క్యాబ్‌లో వస్తుంటే కనీసం రూ. 8 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రైలులో రూ.వెయ్యి తో 6 గంటల్లోనే చేరుకోవచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే తనను తాను మార్చుకుంటూ వస్తోంది. ఎక్కువ ధూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఊహించని ఆదరణ దక్కుతోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ లో కోచ్ లు సరిపోక డిమాండ్ ఎక్కువవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్న 8 కోచ్ లకు అదనంగా మరో 8 కోచ్ లను యాడ్ చేశారు.












Click it and Unblock the Notifications