పవన్ కు మైలేజ్ వచ్చిందిలా..పోయిందిలా..రాష్ట్రంలో అంతా ఇదే చర్చ !

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా అప్పటివరకూ విమర్శల కోసమే విమర్శలు అన్నట్లుగా సాగిన పవన్ రాజకీయ ప్రస్ధానం ఓ కీలక మలుపు తిరగబోతోందా అన్న అంచనాలను కలిగించింది. దీంతో ఆ తర్వాత పవన్ బస్సు యాత్ర ప్రతిపాదన పైనా అంచనాలు పెరిగాయి. చివరికి తాజాగా విశాఖ టూర్ తర్వాత పార్టీ ఆఫీసులో పవన్ ప్రసంగం సైతం భవిష్యత్తుపై ఆశలు రేపింది. కానీ ఆ తర్వాత ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ఆయనకు ఇప్పుడు మైనస్ గా మారినట్లు తెలుస్తోంది.

 పవన్ పై పెరుగుతున్న అంచనాలు

పవన్ పై పెరుగుతున్న అంచనాలు

రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్ధానాల్లో ఓడిపోయి, పార్టీకి కేవలం ఒక్కసీటు మాత్రమే గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ పై ఆ తర్వాత పెద్దగా అంచనాల్లేకుండా పోయాయి. కానీ కొంతకాలంగా పవన్ రూటు మార్చారు. రాజకీయాల్ని క్రమంగా ఒంటపట్టించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆయన తీరులో చాలా మార్పు కనిపించింది. ముఖ్యంగా అధికార వైసీపీపై రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతున్నా దాన్ని సొమ్ముచేసుకునే స్ధాయిలో విపక్ష టీడీపీ లేకపోవడంతో ఆ స్ధానాన్ని పవన్ భర్తీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే వెంటనే అధికారం దక్కపోయినా జనసేనకు ఈసారి గణనీయంగా సీట్లు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

 మైలేజ్ పెంచుకుంటున్న పవన్

మైలేజ్ పెంచుకుంటున్న పవన్

రాష్ట్రంలో తనపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ మైలేజ్ కూడా పెంచుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం గతంలోలా ప్రత్యర్ధుల్ని ఇష్టారాజ్యంగా విమర్శించకుండా.. పూర్తి సబ్జెక్టుతో మాట్లాడటం, గతంలో జగన్ చేసినట్లుగానే కౌలు రైతుల పరామర్శ కోసం ఇళ్లకు వెళ్లడం, విధానపరమైన అంశాలపై ఆచిచూచి మాట్లాడటం, ముఖ్యంగా గతంలో చంద్రబాబుతో కలిసి వెళ్లడం ద్వారా తనపై పడ్డ ముద్రను తొలగించుకునే ప్రయత్నాలు చేయడం పనికొచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైసీపీకి బలమైన ప్రత్యర్ధిగా పవన్ ముద్ర వేసుకోగలిగారు. దీంతో పవన్ ఏం మాట్లాడినా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే స్పందించడం మొదలుపెట్టారు. తద్వారా పవన్

 ఆ ఒక్క నిర్ణయంతో మటాష్ !

ఆ ఒక్క నిర్ణయంతో మటాష్ !

అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా తాజాగా విశాఖ ఘటనల తర్వాత విపక్ష నేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవడం మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని దెబ్బకొట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో విపక్షాల ఐక్యత కోసమంటూ చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడి గళం వినిపిస్తున్నా.. చంద్రబాబుతో పోలిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువ విశ్వనీయంగా కనిపిస్తున్నారు. జనసేన పార్టీ శ్రేణుల్ని సైతం తన లక్ష్యం దిశగా నడిపించడంలో పవన్ ముందున్నారు. అదే సమయంలో తనను పరామర్శ పేరుతో కలవాలని భావించిన చంద్రబాబుకు అడ్డుకట్ట వేయకుండా అనుమతించడంతో పవన్ కళ్యాణ్ కు ఇది మైనస్ గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు గత పాలన వైఫల్యాలు, ప్రస్తుతం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన సాగిస్తున్న ప్రచారం. ఈ విషయంలో చంద్రబాబును పవన్ తక్కువ అంచనా వేశారా అన్న చర్చ రాష్ట్రంలో వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+