ఏడు హత్యలు: సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకున్నారు?

మహబూబ్‌నగర్‌: జిల్లాలో వరుస హత్యలతో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వడ్డే రాజు అనే సీరియల్ కిల్లర్‌ను ఫోన్‌కాల్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. జైనల్లిపూర్‌కు చెందిన ఎల్లమ్మ అదృశ్యమైందని మే 2వ తేదీన ఆమె బంధువులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతురాలి ఫోన్ ఆధారంగానే అతను పోలీసులకు చిక్కాడు.

ఎల్లమ్మను హత్య చేసిన వడ్డెరాజు, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకున్నాడు. సిమ్‌కార్డు తీసేసి, మరో మహిళ సిమ్‌కార్డుతో ఆ ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. అప్పటికే ఎల్లమ్మ ఫోన్‌ను ట్రాకింగ్‌లో పెట్టిన పోలీసులు, ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి ఫోన్ చేశాడో గుర్తించి, వారిని విచారించారు. వడ్డె రాజు తమకు ఫోన్ చేసినట్లు వారు చెప్పడంతో అతడిని అదుపులో కి తీసుకున్నారు.

అతడిని విచారించగా వరుస హత్యల గురించి బయపడింది. ఎవరిని ఎక్కడ హత్య చేశాడో చెప్పడంతో, పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. జైనల్లిపూర్‌కు చెందిన ఎల్లమ్మను పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని గుట్టల్లో హత్య చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు ఆమె అస్తిపంజరాన్ని గుర్తించారు.

ధర్మాపూర్ శివారులో హత్యకు గురైన మరో మహిళ వివరాలు మాత్రం గుర్తించలేదు. ఏడు హత్యలతో పాటు, మరో మహిళపైనా హత్యాయత్నం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

How the serial killer nabbed?

ముగ్గురి హత్య చేసిన లేడీ కిలాడీని, ఏడుగురిని హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, ఈ రెండు కేసులను ఛేదించడంలో పోలీసులు చేసిన కృషిని ఎస్పీ నాగేంద్రకుమార్ ప్రశంసించారు. డీఎస్పీ మల్లికార్జున్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వారికి రూ.25 వేల నగదు రివార్డ్‌ను అందించారు. ప్రభుత్వం తరుపున ప్రత్యేక రివార్డ్ ఇప్పించేందుకు కృషి చేస్తానని జెప్పారు. రివార్డ్ అందుకున్న వారిలో డీఎస్పీ మల్లికార్జన్, రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై గాంధీనాయక్, ఏఎస్సై రమేశ్‌రెడ్డి, నయీమ్, కానిస్టేబుళ్ళు ఆరిఫ్, రఘునాథ్‌రెడ్డి, అమర్, మహమూద్, రంగారెడ్డి, శ్రీనివాసులు, రియాజ్, నిర్మల, ఆయేషా ఉన్నారు.

వడ్డేరాజు చేసిన హత్యలు

1. మార్చి 23న హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ
2.24న మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన డోకూరు వెంకటమ్మ
3. ఏప్రిల్ 28న దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ
4. మే 2న జైనల్లీపూర్‌కు చెందిన ఎల్లమ్మ
5. మే 19న గుర్తు తెలియని మహిళ
6. జూన్ 21న హన్వాడ మండలం కొత్తపేటకు చెంది పార్పల్లి యాదమ్మ
7. 7న నవాబ్‌పేట మండలం చౌడాపూర్‌కు చెందిన చెన్నమ్మ

మంగ లక్ష్మమ్మ చేసిన హత్యలు

1. 2011, మే23న బాదేపల్లిలో గుర్తు తెలియని మహిళ
2. 2013, డిసెంబర్ 18న మోతీనగర్‌కు చెందిన గజ్జి మంగమ్మ
3. ఈ ఏడాది జనవరి 4న దొడ్డలోని పల్లికి చెందిన లక్ష్మమ్మ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+