అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్: ఎలా చేస్తారు?, ఎవరెవరికి ఆ అధికారం ఉంది(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అరెస్టవడం, ఆ తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సీఎంతో పాటు పలు ఉన్నాతాధికారులు ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఎవరెవరికి అధికారం ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లతో కూడిన ఒక గది ఉంటే చాలు.

ఈ గది మొత్తాన్ని సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు. వీటితో పాటు సెల్‌ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సరిపడ సర్వర్లు, రికార్డింగ్‌ పరికరాలు, టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్‌ ఉంటే చాలు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం చేయాల్సిన సెట్టింగ్స్‌ను పరికరాలు అందజేసిన వారే చేసిపెడతారు.

 ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

వీటి ద్వారా ఏసీబీ అధికారులు తమకు కావలనుకున్న వారి సంభాషణలను రికార్డు చేస్తారు. ఇలా రికార్డు చేసే ఒక్కో సర్వర్ ఖరీదు సుమారు రూ. 10 నుంచి 15 లక్షల వరకూ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు 'స్టింగ్ రే పరికరాలు'ను ఉపయోగించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?


అయితే, స్టింగ్‌ రే పరికరాలు ఆ సిగ్నళ్లను డిజేబుల్‌ చేసి, సురక్షితంకాని 2జీ నెట్‌వర్క్‌లోకి వెళ్లేలా చేస్తాయి. అలా వెళ్లగానే సులభంగా ట్యాప్‌ చేస్తాయి.

 ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

మన దేశంలో సీబీఐ, రా, ఐబీ, ఈడీ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఆదాయపన్ను విభాగం, రాష్ట్ర పోలీసు విభాగం అధికారులు మాత్రమే వీటిద్వారా ట్యాపింగ్‌ చేయడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు.

 ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఇటీవల కాలంలో సెల్ టవర్లు ఎక్కువైన దృష్ట్యా టవర్ మీద కూడా ట్యాపింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసి కాల్స్‌ను ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఆ టవర్ ప్రాంతంలో ఉన్న అన్ని నెంబర్లనూ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది.

 ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపుగా 9 వేల ఫోన్ల ట్యాపింగ్‌కు ఉత్తర్వులి స్తోంది. గరిష్టంగా ఒక ఫోన్‌ను మూడు నెలల పాటు ట్యాప్ చేయవచ్చు.

 ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

అయితే ప్రతి రెండు నెలలకొకసారి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, మిలిటెంట్లు విషయంలో అనుమతి తీసుకోకుండానే 72 గంటల పాటు నిఘా సంస్ధలు ఒక ఫోన్‌ని ట్యాప్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, 48 గంటల్లో ఆ ఫోన్ సంభాషణలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది.

English summary
If you have reason to believe that your cell phone or landline phone might be tapped, there are a few clues you can look for that can support your suspicions. Many of these indicators can be caused by other sources, though, so you need to check for multiple signs rather than only relying on one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X