Sujana Chowdary: సుజనా చౌదరి ఎంట్రీతో విజయవాడలో మారబోతున్న లెక్కలివే..!
ఏపీలో ఈసారి ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేసే లోక్ సభ స్ధానాలపై క్లారిటీ వచ్చేసింది. నేడో రేపో అసెంబ్లీ సీట్ల ప్రకటనకు కాషాయ పార్టీ సిద్దమవుతోంది. ఇందులో ఆశ్చర్యకరంగా విజయవాడ లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ తీసుకోవడం, అందులోనూ మాజీ ఎంపీ సుజనా చౌదరిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీని వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు టీడీపీకి ఆర్ధిక మూలస్తంభంగా ఉండి 2014లో తొలిసారి రాజ్యసభ సీటు తీసుకుని ఏకంగా కేంద్రమంత్రి కూడా అయిపోయిన సుజనా చౌదరికి విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో మంచి పట్టు ఉంది. స్ధానికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం సుజనా చౌదరిని ఓన్ చేసుకున్నట్లుగా మరే ఇతర నేతనూ ఓన్ చేసుకోదంటే నమ్మి తీరాల్సిందే. అలాంటి సుజనా చౌదరి తొలిసారి విజయవాడ లోక్ సభ సీటులో పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ మధ్యే చేసిన ప్రకటన ప్రత్యర్ధి వైసీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగుతున్న మాజీ టీడీపీ ఎంపీ కేశినేని నాని గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

చివరకు విజయవాడ లోక్ సభ సీటును కేశినేని సోదరుడు చిన్నికి టీడీపీ కేటాయించడంతో ఇక్కడ ఉన్న ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి అయినా బరిలోకి దిగేందుకు సుజనా చౌదరి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయనకు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లాల్సిన విజయవాడ పశ్చిమ సీటులో బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అయితే సుజనా ఇక్కడి నుంచి పోటీ చేయడంపై టీడీపీలో ఎలాంటి అసంతృప్తీ లేదు. కానీ జనసేన, వైసీపీలో మాత్రమే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుజనా చౌదరి ఎంట్రీతో తన సీటు గల్లంతుకాబోతున్న సంకేతాలు రావడంతో జనసేనకు నాలుగేళ్లుగా పనిచేస్తున్న పోతిన మహేష్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎట్టి పరిస్దితుల్లోనూ విజయవాడ పశ్చిమ సీటు తనకే ఇవ్వాలంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే ఒత్తిడి పెంచేందుకు నిరాహరదీక్షలకు సైతం దిగుతున్నారు. దీంతో పవన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని నిన్న నాగబాబు హెచ్చరికలు కూడా పంపారు. ఈ నేపథ్యంలో పోతిన మహేష్ కు సీటు గల్లంతు ఖాయమైనట్లే.
మరోవైపు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమ సీటును గత ఎన్నికల్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించి గెలిపించిన వైసీపీ.. ఈసారి మాత్రం ముస్లిం అభ్యర్ధి షేక్ ఆసిఫ్ ను బరిలోకి దించింది. తద్వారా కూటమి పార్టీలకు సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్ కు కూటమి వద్ద ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను పోటీకి దింపడం. అది చేసే పరిస్దితి లేకపోవడంతో సుజనా వంటి బిగ్ షాట్ ను రంగంలోకి దింపేందుకు బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సీటు నుంచి సుజనా చౌదరి బరిలోకి దిగితే ఆ ప్రభావం కచ్చితంగా విజయవాడ లోక్ సభ సీటుపై కూడా పడుతుందనే చర్చ సాగుతోంది. అందుకే వైసీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని దీనిపై విమర్శల దాడి మొదలుపెట్టేశారు. సుజనా పోటీతో విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ గెల్చుకోవడం సునాయాసం కాబోతోంది. అలాగే విజయవాడ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే మిగతా సీట్లపైనా ఆ ప్రభావం కచ్చితంగా పడబోతోంది. దీంతో టీడీపీకి విజయవాడ ఎంపీ సీటు గెల్చుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయనే అంచనాలున్నాయి.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications