AP Results Betting: గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ ల జోరు-ఎక్కడెక్కడ ఏ పార్టీకి ఎంతెంత ?

ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్ధితులు కనిపించాయి. ముఖ్యంగా ఎన్నికలు అంటే కచ్చితంగా కనిపించే అజెండాలన్నీ తెరమరుగయ్యాయి. కేవలం జగన్ కావాలా వద్దా అన్న అజెండాతోనే ఎన్నికలు జరిగాయని పోలింగ్ సరళిని చూసిన వారు చెప్తున్నారు. అలాగే భారీ స్ధాయిలో నమోదైన పోలింగ్ కూడా ఇదే తరహాలోనే సాగిందని, అందుకే ఓటర్లు కూడా అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి భారీగా పోలింగ్ లో పాల్గొని 82 శాతం పోలింగ్ కు కారణమయ్యారని తేలింది.

భారీ పోలింగ్ శాతాలు ఓటింగ్ రోజు నుంచే హింసకు కూడా కారణమయ్యాయి. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా భారీగా జరిగిన పోలింగ్ ప్రత్యర్థులకు మంటపుట్టించింది. దీంతో పలు చోట్ల హింస కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు హింస అదుపులోకి రావడంతో క్రమంగా ఇది బెట్టింగ్ లకు కూడా దారి తీస్తోంది. ముఖ్యంగా బెట్టింగ్ లకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఫలితాలపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

huge bettings on Godavari districts election result- here is key ratios

ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లోని పిఠాపురం సీటులో పోటీకి దిగడంతో ఆయన గెలుపుపై భిన్న అంచనాలున్నాయి. దీనికి తోడు టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఉందో లేదో తేల్చాలంటే గోదావరి జిల్లాలే కీలకంగా మారిపోయాయి. దీంతో ఈసారి గోదావరి జిల్లాల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. ఇరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై సైలెంట్ గా బెట్టింగ్ లు వేసేస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో ఈసారి ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే కూటమిలో పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు బాగానే జరిగిందని చెప్తున్నారు. దీంతో కూటమిలో పార్టీల అభ్యర్ధులు పోటీ చేసిన పలు చోట్ల భారీగా బెట్టింగ్ లు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో గమనిస్తే వైసీపీకి దాదాపు 7 స్ధానాల వరకూ దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఆయా సీట్లలో వైసీపీ అభ్యర్ధులకు అనుకూలంగా ఫిఫ్టీ ఫిఫ్టీ బెట్టింగ్ సాగుతోంది. మిగతా సీట్లలో కూటమికి అనుకూలంగా ఏకంగా 1 ఈస్ట్ 4లో బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాను గమనిస్తే గోపాలపురం, పోలవరం వంటి సీట్లను మినహాయిస్తే మిగతా చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్ధులకు అనుకూలంగా బెట్టింగ్ సాగుతోంది. ఇక్కడ కూడా 1 ఈస్ట్ 4 ఈక్వేషన్ తోనే బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 1న వెలువడే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చే ఫలితాలను బట్టి ఈ ఈక్వేషన్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+