కదలి వచ్చిన రియల్ హీరోలు - ఎవరి విరాళం ఎంత...!!
విజయవాడలో వరదల బీభత్సం భారీ అనూహ్య మిగిల్చింది. ప్రాణ - ఆస్తి నష్టం భారీగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్రం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వం దాతల నుంచి విరాళాలు కోరింది. ఆపదలో ఉన్న వారి కోసం అండగా నిలిచేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సాయం ప్రకటించారు. వారితో పాటుగా అన్ని రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. స్వచ్చంద సంస్థలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
విరాళాల వెల్లువ
సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం చంద్రబాబును కలిసిన రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ నటులు ముందుకు వచ్చారు. తాజాగా వెంకటేశ్, రానా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు ప్రకటించారు.

ప్రముఖుల స్పందన
టాలీవుడ్ ప్రముఖ హీరోలు రెండు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక, రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాలు తమ వంతుగా విరాళం అందించాయి. వ్యాపార ప్రముఖులు సైతం స్పందించారు. తాజాగా ఏపీ సీఎం కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వచ్చారు. వారిలో..కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు, జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ. 5 కోట్లు, శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ. 2 కోట్లు, విట్ ఛాన్స్లర్ డా.విశ్వనాథమ్ రూ. కోటి 57 లక్షల 50 వేలు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయలు, రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు(సుజలాన్ & యాక్సిస్ ఎనర్జీ) కోటి రూపాయలు, సీఎం రాజేష్, సీఎం రిత్విక్ కోటి రూపాయలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు రూ. 50 లక్షల మేర చెక్కులు అందచేసారు.

మేము సైతం
వీరితో పాటుగా పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ. 50 లక్షలు, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు, కోటం సంధ్య రూ. 5 లక్షలు, సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ. 5 లక్షలు, వై.చలపతి రావు రూ. లక్ష, పరుచూరి శ్రీనివాసరావు రూ. లక్ష, సీహెచ్ దీపిక రూ. లక్ష, ఏ.శోభారాణి రూ. 50 వేలు స్వాతంత్య్ర సమరయోధులు-సర్వోదయ ట్రస్ట్ తరపున డా.మోహన్ కృష్ణ రూ. 1.50 లక్షలు, బొప్ప అనురాధ రూ. లక్ష, బి.అనురాధ, లక్ష, కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కె.వి.రావు - రూ.5 కోట్లు ఏఎంగ్రీన్-గ్రీన్‌కో సంస్థ - రూ.5 కోట్లు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు - రూ.కోటిన్నర, ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ - రూ.కోటి మేర అందించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications