వైసీపీ జాబ్ మేళాకు విశేషస్పందన; చంద్రబాబు, లోకేష్ లపై ఘాటుగా సాయిరెడ్డి విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం, పార్టీ కార్యకర్తల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నాడు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా మొదలైన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో శనివారం నాడు ఏకంగా 147 కంపెనీలు పాల్గొన్నాయి.

ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు
ఎస్వీ యూనివర్సిటీలో వైయస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా ను అట్టహాసంగా ప్రారంభించిన విజయసాయిరెడ్డి మహానేత వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గా పేర్కొన్నారు. ఇక తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ఏర్పాట్లను మొదటి నుంచి స్వయంగా పర్యవేక్షించి, యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి, అక్కడికి వస్తున్న నిరుద్యోగ యువతకు ఏర్పాట్లు చేయించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తిరుపతి లో నిర్వహిస్తున్న జాబ్ మేళా పై స్పందించారు. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు.

రాయలసీమ యువత నుండి జాబ్ మేళాకు విశేష స్పందన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జాబ్ మేళాకు విశేషంగా నిరుద్యోగులు పోటెత్తారని, ఆదివారం నాడు కూడా ఈ జాబ్ మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎస్వీ యూనివర్సిటీతిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో, కియామోటార్స్ తదితర దాదాపు 147 కంపెనీలు ఈ జాబ్ మేళాలో యువతకు ఉద్యోగాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఉద్యోగార్థులందరూ వారి విద్యార్హతకు తగిన మంచి ఉద్యోగాలు పొందాలని మనసారా కోరుకుంటున్నా అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

లోకేష్ జాబ్ మేళాలో పాల్గొనాలన్న విజయసాయి రెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని, నిరుద్యోగ యువత ఉద్యోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని విజయ సాయి రెడ్డి ఆకాంక్షించారు.
ఇక ఇదే సమయంలో యూనివర్సిటీలలో రాజకీయ కార్యక్రమాలను నిర్వహించడంపై మండిపడిన లోకేష్, యూనివర్సిటీలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు యూజీసీ లేఖ రాసిన నేపథ్యంలో లోకేష్ ను కూడా టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఇంకో పది నెలల్లో ఎమ్మెల్సీ పదవి కోల్పోనున్న నారా లోకేష్ కూడా ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు అంటూ సెటైర్లు వేశారు. కానీ 72 ఏళ్ళు చంద్రబాబుకు మాత్రం జాబ్ ఇవ్వడం కుదరదు, రిటైర్ కావాల్సిందేనంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

మూడు చోట్ల జాబ్ మేళాలు, నిరుద్యోగులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో వైఎస్సార్సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
కనీసం 25 వేల మందికి ఈ జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23, 24 తేదీలలో ఆంధ్ర యూనివర్సిటీ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆపై ఏప్రిల్ 30, మే 1 వ తేదీలలో నాగార్జున యూనివర్సిటీ లో జాబ్ మేళా జరగనున్నాయని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఉపాధి విప్లవం వచ్చిందని సాయి రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా జాబ్ మేళాలు
చంద్రబాబు 44ఇయర్స్ ఇండస్ట్రీ అయితే మాత్రం ఏం ప్రయోజనం అంటూ మండిపడిన విజయ సాయి రెడ్డి, తాను తొమ్మిదేళ్ల సమైక్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు కానీ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో కానీ ఒకరికైనా ఉద్యోగాలు ఇప్పించారా ? కనీస ఇటువంటి జాబ్ మేళా నిర్వహించారా అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నూతన చరిత్రకు నాంది పలికిన వైసిపి నిర్వహిస్తున్న జాబ్ మేళా ను చూసి చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వారు చెయ్యరు, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేని వింత వ్యాధితో తుప్పు నాయుడు, పప్పు నాయుడు బాధపడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications