రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి.. ఎంత దోచుకెళ్లారంటే ?
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి ప్రయాణీకుల వద్ద నగదు, బంగారంతో పాటు విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లడం సర్వత్రా కలకలంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అయితే ఆ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డట్టు సమాచారం.

ఇక సంబంధిత ఘటనపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్లాన్ తోనే ఆ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి తీసుకెళ్లిన మొత్తం ఎంత ఉండొచ్చు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications