ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ట్విస్ట్..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో టీడీపీ షాక్ ఇచ్చింది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక సంస్థల కోటా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల్లో అధికార వైసీపీకి ఆధిక్యత ఉంది. అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్ల చివరి నిమిషం వరకు వైసీపీ అభ్యర్దులే నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో..ఎన్నిక అవసరం లేకుండా అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. కానీ, చివరి నిమిషంలో టీడీపీ నేతలు తీసుకున్న నిర్ణయంతో రెండు జిల్లాల్లో ఇప్పుడు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అనంతపురం, చిత్తూరు తో పాటుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో చివర్లో టీడీపీ అభ్యర్దులు బరిలోకి దిగారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకొనే పరిస్థితులు కనిపించాయి. నామినేషన్ల చివరి వరకు ఇదే అవకాశం కనిపించింది. కానీ, అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ నుంచి మంగమ్మను ఖరారు చేసారు. జిల్లాలో ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేసారు. చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు..యాడికి మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య నామినేషన్ దాఖలు చేసారు. అదే విధంగా చిత్తూరు జిల్లా నుంచి సిపాయి సుబ్రమణ్యంను వైసీపీ తమ అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేసారు. ఆయన గెలుపు ఏకగ్రీవమని పార్టీ నేతలు భావించారు. అయితే, పంచాయితీ చాంబర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసారు.

ఇక.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ అభ్యర్ది కుడుపూడి సూర్యనారాయణ రావు బుధవా రం వరకు ఏ రాజకీయపార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయక పోవడంతో అధికారపార్టీకి చెందిన వర్గీయులు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం అనూహ్యంగా మధ్యాహ్నం నుంచి ముగ్గురు అభ్య ర్థులు నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కడలి శ్రీదుర్గా, అలాగే రామచంద్రపురంరూరల్ మండలం ఉండూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ ఇంత సంతోషం, పి.గన్నవరం మండలం మునగండ గ్రామానికి చెందిన అంబటి కోటేశ్వరరావు నామినేషన్లు వేశారు. దీంతో..ఇప్పుడు అక్కడ ఎన్నిక అనివార్యంగా మారుతోంది. నామినేషన్ల పరిశీలన..ఉప సంహరణ గడువు ముగిసిన తరువాత ఏ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుందనేది స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications