రాజధాని వేట, రేపు విశాఖకు: ఆ మూడు ప్రాంతాలు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం నియమించిన శివరామకృష్ణన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో వారు పర్యటించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం నుండి గురువారం అత్యవసర ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ నేతృత్వంలో సభ్యులు డాక్టర్ రతన్ రాయ్, ఆరోమర్ రవి, జగన్ షా, కెటి రవీంద్రన్‌లు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. వారు ఢిల్లీ నుండి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు విశాఖ చేరుకుంటారు.
విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలు పరిశీలిస్తారు. మూడు రోజుల పర్యటన తర్వాత ఈ నెల 14న హైదరాబాదులో వారు సమావేశం కానున్నారు. మార్చి 28న ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకూ రెండుసార్లు ఢిల్లీలో సమావేశమైంది. రాజధాని ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను, పర్యటన ప్రణాళికను, పరిశీలించాల్సిన అంశాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకుంది.

మొదటి దఫా కోస్తాంధ్రలో ఈనెల 10, 11, 12వ తేదీల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తుంది. రెండో దఫా రాయలసీమలోని ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాలను పరిశీలించనుంది. పరిశీలన పూర్తయిన తర్వాత కమిటీ హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజధాని ఎంపిక కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతుంది.
ఆయా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వనరులు ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో మదింపు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ఇతర కనీస వనరులైన నీరు, భూమి తదితర అంశాలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేసింది.
సమాచారం ప్రకారం.. రాజధాని ఏర్పాటుకు సంబంధించి కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ నుంచి శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలు కోరింది. దీంతో, సదరు విభాగం మూడు ప్రాంతాలను సూచించినట్టు తెలిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు, కృష్ణా జిల్లా విజయవాడ- హనుమాన్ జంక్షన్ మధ్య, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి- విశాఖపట్నం మధ్య కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉందని టౌన్ ప్లానింగ్ విభాగం తెలిపినట్లుగా సమాచారం.
విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేస్తే విజయవాడ- గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం భవనాన్ని పరిపాలన విభాగంగా ఉపయోగించుకోవచ్చునంటున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తే తిరుపతి, ఒంగోలు లేదా కర్నూలు ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్పు చేయాలని, విశాఖలో ఐఐటీ, ఐఐఎంలలో ఒకదానిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టు తెలిసింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications