Crime News: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. భార్య తలను రెండు ముక్కలు చేసిన భర్త..
భార్య చేయి నరికి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దారుణం జరిగింది. వీరంపాలెనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే దావీదు ఏ పని చేయకుండా వ్యసానాలకు అలవాటు అయ్యాడు. ఈ క్రమంలో దంపతులిద్దరికి గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నిర్మల తన పిల్లలను పుట్టింట్లో వదిలి ఉపాధి కోసం కువైట్ వెళఅలింది.
అందరు వెళ్లిపోవడంతో దావీదు మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం కువైట్ లో ఉన్న భార్యకు ఫోన్ చేసే వాడు. నిర్మల ఒకటి రెండు సార్లు డబ్బులు పంపింది. కానీ ఆ డబ్బును దావీదు తాగాడానికి వాడేశాడు. దీంతో నిర్మల డబ్బులు పంపాలేదు. దీంతో దావీద్ నిర్మల పుట్టింటికి వెళ్లి ముగ్గురు పిల్లల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. డబ్బులు పంపకుంటే కూతుళ్లను కొడతానంటూ బెదిరించేవాడు. దీంతో నిర్మల కొద్ది రోజులు డబ్బులు పంపింది. పైసలు తాగాడానికే ఖర్చు పెట్టడంతో ఆమె డబ్బులు పంపడం మానేసింది.

భార్య తనకు డబ్బు పంపడం లేదంటూ దావీదు తరచూ కుమార్తెలకు చిత్రహింసలు పెట్టాడు. దావీదు కూతుళ్లను కొడుతున్న దృశ్యాలను కుమారుడితో మొబైల్‌లో చీత్రికరించి కువైట్‌లోని నిర్మలకు పంపించాడు. అయితే ఆ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దావీదును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్న నిర్మల కువైట్ నుంచి పుట్టింట్లోనే పిల్లలతో ఉంటుంది. బెయిల్ పై బయటకొచ్చిన దావీదు నిర్మల వద్దకు వెళ్లాడు.
భార్యను బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చాడు. గురువారం రాత్రి దావీదు తాగి రావడంతో నిర్మలతో గొడవ జరిగింది. ఇది మనుసులో పెట్టుకున్న దావీదు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిర్మల మెడ, చేయి కోశాడు. తలను రెండు ముక్కలు చేశాడు. నిర్మల చేయిని నరికి ఆమె మరో చేతిలో పెట్టి అత్యంత కృరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications