మద్యం తాగొద్దన్నందుకే ఇలాంటి నిర్ణయమా?: భార్య అసలు ఊహించలేదు..
ఇటీవల చెంచయ్యకు అపెండిసైటిస్ చికిత్స కూడా జరిగింది. మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెప్పినా.. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
నెల్లూరు: తాగుడుకు బానిసైన ఓ భర్తను భార్య వారించింది. మద్యం మానేసి కుటుంబాన్ని పట్టించుకోవాలని మందలించింది. ఇలా భార్యభర్తల మధ్య గతంలోను చాలాసార్లు గొడవ జరిగింది. అయినా అతనిలో మార్పు రాలేదు సరికదా.. భార్య మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలకు తీవ్రంగా నొచ్చుకున్నాడు.
అదే మనస్తాపంతో ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. భర్త ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నెల్లూరు నగరంలోని నవాబుపేటలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్సీ బాలయ్యనగర్‌కు చెందిన పి.చెంచయ్య(32), లావణ్య భార్య భర్తలు. 31ఏళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చెంచయ్య స్థానికంగా ఓ అపార్ట్ మెంటులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను.. నిత్యం మత్తులో జోగుతుంటాడు.

ఇటీవల చెంచయ్యకు అపెండిసైటిస్ చికిత్స కూడా జరిగింది. మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెప్పినా.. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో భార్య తరుచూ మందలిస్తూ వస్తోంది. ఇదే క్రమంలో జూన్ 1వ తేదీన కూడా మద్యం గురించి దంపతులు మధ్య గొడవ జరిగింది. ఫూటుగా మద్యం తాగిన భర్తను భార్య వారించింది.
భార్య మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన చెంచయ్య.. చెదలు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. భర్త మరణంతో లావణ్య కన్నీరుమున్నీరైంది.












Click it and Unblock the Notifications