భార్య గొంతు కోసి.. విజయవాడలో నడిరోడ్డుపై భర్త దారుణం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా సంక్షేమానికి, మహిళా రక్షణకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం షాక్ కు గురయ్యే ఘటన జరిగింది. విజయవాడలో జరిగిన దారుణ ఘటనలో కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే గొంతుకోసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
భర్తకు దూరంగా భార్య
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య అన్న జాలి కూడా లేకుండా కట్టుకున్న వాడే నడిరోడ్డు పైన భార్య గొంతు కోసి హత్య చేశాడు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి అనే మహిళ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ గొడవలు పడుతున్న క్రమంలో ఆమె భర్తకు దూరంగా ఉంటుంది.

నడిరోడ్డుపైన గొంతు కోసి ప్రాణం తీసిన భర్త
భార్య పైన కోపం పెంచుకున్న భర్త నడిరోడ్డు పైన ఆమెను హత్య చేశాడు పట్టపగలు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో ఆమె గొంతు కోసి ప్రాణం తీశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హతమార్చిన సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అసలు హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.
విజయవాడలో వారం రోజుల ముందే గొంతు కోసిన ఘటన
ఇదిలా ఉంటే నవంబర్ 5వ తేదీన కూడా విజయవాడలోని గవర్నర్ పేట అశోక్ రెసిడెన్సీలో ఒక వ్యక్తి తన భార్య గొంతు కోసి హత మార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న క్రమంలో, కలిసి మాట్లాడతానని నమ్మించి హోటల్లో గది అద్దెకు తీసుకొని రమ్మని పిలిచిన భర్త ఆపై అమ్మను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు.
కుటుంబ కలహాలతో హత్యలు, జీవితాలు నాశనం
ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా ప్రాణాలు తీయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇటువంటి చర్యలతో సదరు వ్యక్తులు కూడా జైలు పాలెం నిండు జీవితాన్ని కోల్పోతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications