హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 మందిపై రౌడీ షీట్, పోలీసు హెచ్చరిక (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేరాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్న 13 మందిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ ఎసిపి ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం రౌడీ షీట్ తెరిచారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ 13 మందిని పోలీసు అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో వారిని ఇన్‌స్పెక్టర్ పి. మురళీకృష్ణతో కలిసి ఎసిపి మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధుల్లో నిరుడు నేరాలకు పాల్పడినవారి వివరాలు సేకరించి, నేరాలను అరికట్టేందుకు కొత్త రౌడీషీట్లు తెరిచినట్లు ఎసిపి మీడియాతో చెప్పారు.

Hyderabad police to open history sheets against 13 criminals

అవసరమైతే ఎప్పుడైనా రౌడీషీట్ల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాజాగా రౌడీషీట్లు నమోదైన వారు పదేళ్ల పాటు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా మంచి నడవడికతో మెలిగితే రౌడీ షీట్లు తొలగిస్తామని ఆయన చెప్పారు.

థామస్ డేవిడ్, ఎస్‌కె అక్బర్ అలీ, మొహమ్మద్ కమాలుద్దీన్, అరిక్ రాజ్, కె ఆనంద్, పి. శ్రీధర్‌లపై రౌడీ షీట్లు తెరిచారు. కాగా, 50 మందిపై హీస్టరీ సస్పెక్ట్ షీట్లు తెరిచినట్లు పోలీసులు చెప్పారు.

English summary
As part of putting a check on activities of criminals, West Zone police have identified 50 persons against whom history and suspect sheets will be opened in 13 police stations of the city. On Wednesday, 15 sheets were opened against persons accused of grievous bodily offences, crime against women, bootleggers and gambling organizers in Banjara Hills and Jubilee Hills police stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X