హెచ్చరిక: ఏపీ, తెలంగాణలో అతి ముఖ్యమైన రైలుకు రూట్‌ను మార్చిన రైల్వే
ప్రయాణికులకు ముఖ్య గమనిక. హైదరాబాద్ నుంచి తాంబరం మధ్య ప్రయాణించే 12760 రైలును వచ్చే నెల రెండోతేదీ నుంచి పదో తేదీ వరకు మార్గాన్ని మార్చి నడపనున్నారు. వరంగల్, ఖాజీపేట, మహబూబాబాద్, ఖమ్మంకు బదులుగా నల్గొండ, గుంటూరు, తెనాలి మీదుగా ప్రయాణించనుంది. గుంటూరు, నల్గొండలో అదనంగా హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే తాంబరంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే 12759 రైలును కూడా వచ్చే నెల రెండోతేదీ నుంచి పదో తేదీ వరకు వరంగల్, ఖాజీపేట, ఖమ్మంకు బదులుగా తెనాలి, గుంటూరు, నల్గొండమీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైలుకు కూడా గుంటూరు, నల్గొండలో అదనపు హాల్ట్ సౌకర్యం ఇచ్చారు.
కొన్ని రైళ్ల రీషెడ్యూల్
వాల్తేర్ డివిజన్ లోని పుండి-నౌపడ మధ్య భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్ మధ్య నడిచే 12830 రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు బదులుగా 12.55 గంటలకు బయలుదేరుతుంది. అలాగే పూరీ-గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ 22974 ఉదయం 11.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 12.45 గంటలకు, భువనేశ్వర్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ మధ్యాహ్నం 12.10 గంటలకు బదులుగా 12.55 గంటలకు బయలుదేరుతుంది. ఈనెల 13వ తేదీ వరకు ఈ వర్తింపు ఉంటుంది.

విశాఖ నుంచి పలాస మధ్య
విశాఖపట్నం నుంచి పలాస మధ్య తిరిగే మెమె 07470 రైలును శ్రీకాకుళం రోడ్డు వరకే తిప్పుతున్నారు. అలాగే పలాస నుంచి విశాఖ మధ్య తిరిగే 07471 రైలును శ్రీకాకుళం రోడ్డు నుంచి విశాఖపట్నం వరకు తిరుగుతుంది. ఈనెల 13వ తేదీ వరకు ఈ వర్తింపు ఉంటుంది. ఈ మార్పులు ప్రయాణికులు గమనించి రైల్వేకు సహకరించాలని కోరారు. గతేడాది ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండ్ ప్రమాదానికి గురికావడంతో దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను భారతీయ రైల్వే ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా అన్ని డివిజన్లలో పరిధిలో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications