ఇంట్లో మృతి, అస్తిపంజరాలు: హంటింగ్ హౌస్ దుమారం
హైదరాబాద్: హైదరాబాదులోని కుందన్‌బాగ్ ఉమానగర్‌లోని ఓ పాత భవనంలో ఓ మహిళతో పాటు ఇద్దరు కూతుళ్లు మరణించారు. మృతులను శారద పెద్ద కూతురు జయప్రద, ఆమె ఇద్దరు కూతుళ్లుగా గుర్తించారు. మానసిక క్షోభతో వారు మరణించినట్లు చెబుతున్నారు. శారద, ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండడంతో వారు మరణించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఇంట్లో మరణించినవారు అస్తిపంజరాలుగా మిగిలారు.
పోలీసులకు పట్టుబడిన ఓ దొంగ ఇంట్లో అస్తిపంజరాలను చూసినట్లు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇంటిని అమ్మేయాలని శారద నిర్ణయించుకున్నారు. బ్రోకర్లు చాలా తక్కువ ధరకు అడగడంతో శారద, ఆమె కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. దీంతో బ్రోకర్లు దెయ్యాలున్నాయని పుకార్లు పుట్టించారు. దీంతో ఆదిత్య అనే వ్యక్తి హైదరాబాద్ హంటింగ్ హౌస్ పేరిట ఓ వెబ్ ఖాతను తెరిచారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని, అక్కడికి వెళ్లినవారికి కలిసి వస్తుందని బ్రోకర్లు కలిసి వస్తుందని బ్రోకర్లు సృష్టించిన పుకార్లతో గత పది రోజులుగా అర్థరాత్రి విద్యార్థులు, యువకులు మోటారు సైకిళ్లపై రేసింగులతో అక్కడికి చేరి, ఇంటిపైకి రాళ్లు విసురుతూ అల్లరి చేస్తున్నారు.

దాంతో ఇంటి యజమానికి శారదకే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారికి కూడా నిద్రాహారాలు కరువయ్యాయి. శుక్రవారం తెల్లవారు జామున కూడా పంజగుట్ట పోలీసులు ఆ ప్రదేశంలో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 18 మంది ఫేస్‌బుక్ చూసి వచ్చామని తెలిపారు. దీంతో ఎవరూ ఆ ప్రదేశానికి రావద్దని,త ఒకవేళ వచ్చినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండు చేస్తామని హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి సత్యనారాయణ అన్నారు.
కుందన్‌బాగ్‌లోని కొమ్మారెడ్డి శారదకు చెందిన పాత భవనం వద్దకు ఫేస్‌బుక్ లేదా హైదరాబాద్ హంటింగ్ హస్ పేరుతో ఉన్న వెబ్‌సైట్ చూసి ఎవరూ రావద్దని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications