ఏపీ ప్రజల ఎమోషనల్ అటాచ్మెంట్ - తెగిపోతుందా..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. ఏపీలో అధికారంతో సహా పలు కీలక అంశాలకు ఈ ఫలితాలు సమాధానంగా నిలవనున్నాయి. ఏపీ రాజధాని అంశం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలో ప్రజా తీర్పు కీలకం కానుంది. రేపు (ఆదివారం) రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతోంది. చట్ట ప్రకారం హైదరాబాద్‌తో, తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. హైదరాబాద్ తో ఏపీ ప్రజలకు ఎమోషనల్ అటాచ్మెంట్ కొసాగుతోంది. మరి నెక్స్ట్ ఏంటి.
ఉమ్మడి రాజధాని
ఏపీ రాజధాని పై వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో 2014లో పార్లమెంట్ లో ఆమోదించిన విభజన చట్టం మేరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ఇక, రేపటి నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని. కానీ, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు.

రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్ తమది కాకుండా పోతుందనే ఉద్వేగం ఏపీ ప్రజల్లో కనిపించింది. పదేళ్ల కాలంలో ఏపీలో కొత్త రాజధాని నిర్మాణ సమయం కోసం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించారు. కానీ, ఏపీలో ఇప్పటికీ రాజధాని అంశం ఇంకా న్యాయస్థాన పరిధిలోనే ఉంది.
కాలపరిమితి ముగింపు
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 1,442 మంది ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించగా, ఎన్నికల కోడ్ ముగిశాఖ నిర్ణయం తీసుకుంటామందని అధికారులు వెల్లడించారు.
విశాఖలో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపామని, నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.294 కోట్లని పేర్కొన్నారు. భూమి విలువ రూ.358 కోట్లుగా ఉందని చెప్పుకొచ్చారు.ఈ పదేళ్లలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియ జేయాలని, దీనికి అనుగుణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించాలి.
ఫలితాల తరువాత
హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. లేక్‌వ్యూ అతిథి గృహం, సీఐడీ హెడ్‌క్వార్టర్స్, హెర్మిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి.
వీటిని జూన్ 2 తర్వాత కూడా తమ అధీనంలోనే ఉంచుకుంటామని ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇక..హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగానే ఇక కొనసాగినా...భాగ్యనగరంతో తమకు ఉండే అనుబంధం మాత్రం కొనసాగుతుందని తమ అభిమానం చాటుకుంటున్నారు.












Click it and Unblock the Notifications