వైసీపీకి అనుకూలంగా తీర్పులు..ఏపీ హైకోర్టు జడ్జీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత రెండు రోజులుగా తాను ట్రోలింగ్‌కు గురవుతున్నానని, దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ "సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్" అంటూ బెంచ్‌పైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత వారం సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్‌ను అనుమతించినప్పటి నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిందితులకు బెయిల్ ఇచ్చే క్రమంలో ట్రోలింగ్‌పై స్పందించారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోలింగ్‌కు పనికొస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, తన ముందున్న అన్ని బెయిల్ కేసులను వచ్చే వారం బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం, న్యాయమూర్తులపై ట్రోలింగ్‌ల పట్ల ఉన్న ఆందోళనను స్పష్టం చేస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా తీర్పులు రావడంతోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌పై ఇలా ట్రోల్స్ నడిచాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications