రాజ్యసభ పదవి కోసం జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేయలేదు: విజయసాయి
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను ఎన్నడూ బ్లాక్‌మెయిల్ చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను ఎన్నడూ బ్లాక్‌మెయిల్ చేయలేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు, జగన్ కుటుంబానికి మధ్య ప్రేమాభిమానాలతో కూడిన అనుబంధముందని, బ్లాక్ మెయిల్ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు.

జగన్ అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి, ఆయన రహస్యాలన్నీ తెలిసుండటం చేతనే, రాజ్యసభ సీటును ఇప్పించుకోగలిగారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
ఆ వార్తలు నిరాధారమైనవని చెప్పారు. ఊహాజనితాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జగన్‌ను వీడే పరిస్థితి ఉండదని చెప్పారు. అన్ని కేసుల నుంచి నిర్దోషులుగా బయటపడతామన్న నమ్మకం ఉందన్నారు.












Click it and Unblock the Notifications