భార్య, కొడుకును నేను హత్య చేయలేదు, బాధలోనే ఆరోపణలు: హనుమంతరావు

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్/ప్రకాశం: తన భార్య శశికళ, కుమారుడు హనీశ్ సాయిని తాను హత్య చేయలేదని హనుమంతరావు చెప్పారు. శశికళ తల్లిదండ్రులు బాధలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

అమెరికాలో తెలుగువారిపై మరో దారుణం: రక్తపు మడుగులో తల్లీ, కొడుకు

టెక్కీ, కొడుకు హత్య: కేరళ యువతి వల్లే చిచ్చు?, హత్యపై అనుమానాలు

అల్లుడికి వేరే మహిళతో లింక్, అతనే చంపేశాడు:శశికళ తల్లిదండ్రులు

బాధలోనే నాపై ఆరోపణలు

బాధలోనే నాపై ఆరోపణలు

తాను ఆఫీసు నుంచి ఇంట్లోకి వచ్చేసరికే భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారని చెప్పారు. తాను షాక్‌కు గురై వెంటనే పోలీసులకు, శశికళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

నిజా నిజాలు తేలుతాయి..

నిజా నిజాలు తేలుతాయి..

నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయని అన్నారు. భార్య, కుమారుడి మృతదేహాలు స్వగ్రామానికి వస్తాయని చెప్పిన ఆయన.. తాను మాత్రం వచ్చేది లేనిది నిర్ణయించుకోలేదని చెప్పడం గమనార్హం.

అక్రమ సంబంధమే కారణమా..

అక్రమ సంబంధమే కారణమా..

కాగా, శశికళను, ఆమె కుమారుడిని ఆమె భర్తే హత్య చేశాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ కేరళ యువతితో అక్రమ సంబంధం కారణంగానే తమ కూతరు, మనవడిని హనుమంతరావు హత్య చేశాడని వారు ఆరోపించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తొమ్మిదేళ్లుగా అమెరికాలో..

తొమ్మిదేళ్లుగా అమెరికాలో..

హనుమంతరావు, శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారు అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు విగతజీవులుగా పడివున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hanumantha Rao on Friday said that he will not killed my wife Sasikala, and son Hanish Sai in America.
Please Wait while comments are loading...