మీరు సలహా ఇస్తే తీసుకుంటా, బాలకృష్ణనే అడగండి!: రోజాకు అఖిలప్రియ

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల మాటల యుద్ధంలోకి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను వైసిపి ఎమ్మెల్యే రోజా లాగడంపై టిడిపి నేత, మంత్రి అఖిలప్రియ ఘాటగా స్పందించారు.

బాలకృష్ణ గురించి ఇక్కడెందుకు?

బాలకృష్ణ గురించి ఇక్కడెందుకు?

ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి గురించి తాను మాట్లాడుతుంటే మీరు బాలకృష్ణ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నల గురించి మాట్లాడటం ఏమిటని అఖిలప్రియ ప్రశ్నించారు. ఇక్కడ వారి గురించి ఎందుకని అడిగారు. నంద్యాల గురించి మాట్లాడాలని సూచించారు.

వాళ్లనే అడుగు, శిల్పా వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?

వాళ్లనే అడుగు, శిల్పా వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?

తాను నంద్యాల గురించి మాట్లాడితే, దాని గురించి మాట్లాడడం మానేసి, ఇతరులను అడగాల్సిన మాటలు తనను అడగడం ఎంతవరకు సబబని అఖిలప్రియ ప్రశ్నించారు. మహిళలపై శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలను రోజా సమర్థిస్తున్నారా? అని నిలదీశారు.

YSRCP Roja Not Ready To Apologise, Asks Proof : Suspension Extension continues - Oneindia Telugu
అవి కరెక్టేనా?

అవి కరెక్టేనా?

బాలకృష్ణ సినిమా ఫంక్షన్లో మహిళలు ముద్దులు పెట్టడానికి పనికొస్తారనడం మాట్లాడటం కరెక్టా అని, బొండా ఉమ అసెంబ్లీలో తనను విమర్శించడం కరెక్టా అని, బుద్ధా వెంకన్న తన సినిమాల్లో పాత్రల గురించి విమర్శించడం సరైనదేనా అని రోజా అడిగారు.

మీరు సలహా ఇస్తే తీసుకుంటా

మీరు సలహా ఇస్తే తీసుకుంటా

తాను రాజకీయాలకు కొత్త అని, తాను రాజకీయాలు చేయడం నేర్చుకోలేదని, తాను చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నానని అఖిల ప్రియ స్పష్టం చేశారు. రోజా ఏవైనా సలహాలిస్తే తెలుసుకుంటానని అఖిలప్రియ స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and minister Akhila Priya said that she is ready to take suggetions from YSR Congress party MLA Roja on politics.
Please Wait while comments are loading...