జగన్‌తో మాట్లాడేందుకు సిద్ధం: జెసి, బస్సు ప్రమాదంపై..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ అధిష్టానం మధ్యన సంధి కుదిర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నాయకుడు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు.
కొత్త పార్టీ విషమయై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అడగాలని ఆయన సూచించారు. బొత్స తమ వాడేనని చెప్పారు. బొత్స కక్ష సాధింపు, ముఖ్యమంత్రి లాలూచి అని తాను చెప్పాలని మీడియా భావిస్తోందన్నారు.

బస్సు ప్రమాదంపై..
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో దివాకర్ ట్రావెల్స్ పైన కేసు పెట్టడంలో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. ఈ ప్రమాదం విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు.
మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి గుంటూరు జిల్లాలో అన్నారు. తన ఎంపీలాడ్స్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications