ఆ సీటు వంగవీటి రాధాదే, ఆయనతో కలిసి పని చేస్తా, జగన్ చెప్పారు: గౌతమ్ రెడ్డి
విజయవాడ: ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకు, ఆ పార్టీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి మధ్య పరోక్ష మాటల యుద్ధం నడిచి విషయం తెలిసిందే. వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలకు గాను గౌతం రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ముఖ్య నేతలు ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతూ ఇటీవల వంగవీటి రాధా అలక వహించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు.

ఈ నేపథ్యంలో తాజాగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. వంగవీటి రాధాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంశంపై మాట్లాడుతూ తనకు ఉత్తర్వులు అందలేదన్నారు.వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం
విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధదే అని జగన్ తనకు చెప్పారని, ఆయనతో కలిసి పని చేస్తానని చెప్పారు. కాగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ను గౌతమ్ రెడ్డి ఇటీవల కలిశారు.












Click it and Unblock the Notifications