మహిళ అని సంయమనం, పల్లెటూరిలో పుట్టిపెరిగా.. నీకంటే ఎక్కువే మాట్లాడగ‌ల‌ను: అమ‌ర‌నాథ్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమరనాథ్‌రెడ్డి స్పందించారు. రోజా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు నాయుడి ప్రభుత్వం, ఏపీ మంత్రులు అంతా అవినీతిమ‌యం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే.

amarnath-reddy-roja

రాష్ట్రంలో మహిళలపై జ‌రుగుతోన్న‌ దాడులపై కూడా రోజా తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని విమర్శించారు. దీనిపై ఏపీ మంత్రి అమరనాథ్‌రెడ్డి శుక్రవారం స్పందిస్తూ.. రోజా ఓ మహిళ కాబ‌ట్టి తాను సంయమనం పాటిస్తున్నానని వ్యాఖ్యానించారు.

తాను పల్లెటూరిలో పుట్టిపెరిగాన‌ని, రోజా కంటే ఎక్కువగా తాను వ్యాఖ్య‌లు చేయ‌గ‌ల‌న‌ని మంత్రి అన్నారు. తాను పుట్టినప్పుడే మూడువేల ఎకరాల భూస్వామినని, త‌న‌ కుటుంబంలో ఎవరిపైనా అవినీతి కేసులు లేవని అమరనాథ్ రెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Minister Amaranath Reddy fired on YSRCP MLA RK Roja on Friday. He also said "I born in Village.. I can speak more than Roja". MLA Roja on Thursday criticised TDP Government and CM Chandrababu Naidu on various issues. As a counter for her comments today Minister Amaranath Reddy responded.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి