ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఏపీ పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తమకు కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అన్నారు. తాను దర్యాప్తు నివేదికలు తెప్పించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అంతేగాక, కోడెల తనకు మంచి మిత్రుడని కిషన్ రెడ్డి తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నారనే విషయం నమ్మలేకుండా ఉందని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే తాను సూచించానని తెలిపారు.
ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడే వ్యక్తి.. ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడంపై తమకు అనుమానాలున్నాయని పలువురు టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల డీజీపీల నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని తెలిపారు.
టీడీపీ నేతల వల్లే కోడెల ఆత్మహత్య..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవమానించడం వల్లే కోడెల శివప్రసాదరావు మరణించాడని వైసీసీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఆరోపించారు. కొద్ది రోజులుగా చంద్రబాబు.. శివప్రసాదరావుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని.. ఆ అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోడెలను వర్ల రామయ్య దూషించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications