ఏపీపై ఫోకస్ పెట్టమని ఢిల్లీ పెద్దలను కోరతా: బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం నిర్మించతలపెట్టిన నిట్ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు...అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను వారికి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు రాంమాధవ్, మురళీధర్ రావును కలవనున్నట్లు చెప్పారు.

ఢిల్లీ పెద్దలను కలసి ఏపీపై ఎక్కువ దృష్టి పెట్టాలని వారిని కోరనున్నట్లు ఎమ్మల్యే మాణిక్యాలరావు ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ మహానాడులో అంతా ప్రధాని మోడీ, అమిత్ షాలను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చాలా చేసిందని...అయినా బీజేపీని దోషిగా నిలబెట్టాలని టిడిపి నేతలు ప్రయత్నించడం దారుణం అన్నారు.












Click it and Unblock the Notifications