త్వరలో పాదయాత్ర, సినిమాలు వాయిదా, పూర్తిస్థాయి లీడర్ ఎవరు?: పవన్ ప్రశ్న

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నేను అవసరమైతే సినిమాలు తీయడం వాయిదా వేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. త్వరలో అనంతపురం నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు.

పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు?

పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు?

తనను పార్ట్ టైం రాజకీయ నాయకుడు అని చాలామంది విమర్శలు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజకీయాల్లో పూర్తి టైం రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పాలని నిలదీశారు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చి రూ.కోట్లు ఆర్జించారని విమర్శంచారు.

నా కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాల్లో..

నా కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాల్లో..

నేను తన కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాలలో నటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సినిమా అన్నా, సినిమా పరిశ్రమ అన్నా తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. అయితే, రాజకీయాల కోసం అవసరమైతే సినిమాలు వాయిదా వేసుకుంటానని చెప్పారు.

తాను తుది శ్వాస విడిచే వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే సినిమాలను కూడా పక్కన పెడతానని చెప్పారు.

అనంతపురం నుంచే పోటీ

అనంతపురం నుంచే పోటీ

తాను అనంతపురం జిల్లా నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలో అనంత నుంచి పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

150 మంది జనసైనికుల హాజరు

150 మంది జనసైనికుల హాజరు

కాగా, అంతకుముందు అనంతపురం జిల్లాకు చెందిన జనసేన సైనికులతో పవన్ భేటీ అయ్యారు. 150 మంది వరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో పవన్ మాట్లాడారు. ప్రశ్నించి సాధించుకునే దిశగా మన ప్లానింగ్ ఉండాలన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేద్దామన్నారు. రాజకీయ లబ్ధి ఎవరికన్నది ముఖ్యం కాదని, అంతిమంగా రైతుకు లబ్ధి చేకూరాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will contest from Anantapur distcict in next general elections, says Pawan Kalyan
Please Wait while comments are loading...