ఉండవల్లిలో పవన్ హల్‌చల్: ప్రత్యేక హోదాపై ఇలా, జగన్‌పై సెటైర్

ఉండవల్లి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అని వారిని ప్రశ్నించారు. దానికి చాలామంది గ్రామస్థులు.. అందుకు సిద్ధంగా లేమని చెప్పారు. పవన్ రైతులతోనే ఎక్కువగా మాట్లాడించారు.

పవన్ ఉండవల్లి గ్రామానికి రాగానే పెద్ద ఎత్తున గ్రామస్థులు, అభిమానులు తరలి వచ్చారు. పవన్ రాగానే.. అందరు పవన్.. పవన్ అంటూ నినాదాలు చేసారు. వారికి పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు. దయచేసి ఆగాలని సూచించారు. ఆ తర్వాత ప్రజలను సమస్యలు అడిగారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు ఆయనకు విన్నవించారు.

మీరు రాజధానికి రోడ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అని పవన్ గ్రామస్తులను ప్రశ్నించారు.

అందుకు రైతులు మాట్లాడుతూ.. తాము భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేని, రోడ్లు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ ఊరు ఊరు మొత్తం ల్యాండ్ పూలింగులో ఉందని చెప్పారు. దయచేసి ఇక్కడి పొలాలు మాత్రం ల్యాండ్ పూలింగులో తీసుకోవద్దని వారు కోరారు. రోడ్లు తీసుకొని, భూములు మాత్రం తీసుకోవద్దన్నారు.

I will hear your problems, say Pawan Kalyan

మా బాధలు వినండి... ప్రజలు, అరవొద్దు.. పవన్

మా బాధలు వినాలని, మాకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దానికి పవన్ స్పందిస్తూ.. మీ బాధలు వినేందుకు నేను వచ్చానని, మీరు అరవొద్దని, అరుపులు వినేందుకు రాలేదని, మీ బాధలు చెబితే అర్థం చేసుకుంటానని ఆయన చెప్పారు. మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు.

ఉండవల్లి కోసం పోరాటం చేసేందుకు వచ్చా.. మీ కోసం నిలబడేందుకు వచ్చా..

నేను ఉండవల్లి కోసం పోరాడేందుకు వచ్చానని, మీ కష్టాలు తెలుసుకొని, మీ తరఫున నిలబడేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు మీ సమస్యలు చెప్పవచ్చునని తెలిపారు.

ఇంకా దేహీ అనొద్దు

పవన్ తుళ్లూరులో మాట్లాడుతూ... ఏపీకీ ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు. ఇంకెంత కాలం మనం దేహీదేహీ అని అర్తిద్ధామని వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా ఇంకా ఇవ్వలేదన్నారు. అది రాకపోతే ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడాలన్నారు. రాజధాని నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలన్నారు. కాగా, రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. ఎక్కువగా రైతులతోనే మాట్లాడిస్తున్నారు.

జగన్ పైన సెటైర్

జగన్ పైన సెటైర్ తాను రాజకీయ లబ్ధి కోసం రాలేదన్నారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే భూములు ఇస్తానని తాను చెప్పడం లేదని, కేవలం రైతులకు న్యాయం చేయడానికే వచ్చానని జగన్ వ్యాఖ్యల పైన సెటైర్ వేశారు. వైయస్ హయాంలో వాన్ పిక్ కోసం వేలాది ఎకరాలు లాక్కున్నారన్నారు. అందులో ఒక ఎకరం భూమినిని కూడా వినియోగించలేదన్నారు. ఇలాంటి ఘోరాలు వైయస్ హయాంలో ఎన్నో జరిగాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+