15రోజుల టైమిస్తున్నా, రాజకీయాలు వదిలేస్తా: పారడైజ్‌పై బాబుకు జగన్ దమ్మున్న సవాల్, బీజేపీతో పొత్తుపై

Posted By:
Subscribe to Oneindia Telugu
YS Jagan on Paradise Papers leak:ఇలాంటి cm ఉంటే ఎంత ఊడితే ఎంత? 15రోజుల టైమిస్తున్నా| Oneindia Telugu

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పారడైజ్ పేపర్ లీక్ అంశంపై స్పందించారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజుకు చేరుకుంది.

భాష కాదు, 10మంది రోజాలు వచ్చినా, ఎన్టీఆర్‌కు ఆనాడే చెప్పా: వాణీ విశ్వనాథ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు నిరూపించాలని అధికార పార్టీని నిలదీశారు.

'ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రత్యేకస్థానం, ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఈ పేరు'

చంద్రబాబుకు 15 రోజుల సమయం ఇస్తున్నా

చంద్రబాబుకు 15 రోజుల సమయం ఇస్తున్నా

సీఎం చంద్రబాబుకు తాను పదిహేనురోజుల సమయం ఇస్తున్నానని జగన్ చెప్పారు. తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. విదేశాల్లో ఒక్క పైసా అయినా తనకు ఉన్నట్లు నిరూపించాలన్నారు. ఆ దమ్ము బాబుకు ఉందా అన్నారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా, రాజీనామా చేస్తావా

రాజకీయాల నుంచి తప్పుకుంటా, రాజీనామా చేస్తావా

తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ సవాల్ విసిరారు. లేదంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా, ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా, అందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

నీకు ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది?

నీకు ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది?

అసలు చంద్రబాబుకు అంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులో దొరికిపోయాడన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని, ఇంత నల్లధనం చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

నంద్యాలలో గెలిచేవాడిని కదా

నంద్యాలలో గెలిచేవాడిని కదా

నంద్యాలలో ఓటుకు రూ.15 వేలు, రూ.10వేలు ఇచ్చింది చంద్రబాబు, నేనా అని జగన్ ప్రశ్నించారు. తనకు విదేశాల్లో డబ్బులు ఉంటే, తన వద్ద నల్లధనమే ఉంటే నంద్యాల ఉప ఎన్నికల్లో తాను ఎందుకు ఓటమి చవిచూసేవాడినని ప్రశ్నించారు.

తప్పుదారి పట్టిస్తున్న చంద్రబాబు

తప్పుదారి పట్టిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు పేపర్, మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. లీకులు ఇచ్చి అలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పారడైజ్ పేపర్లు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇందులో జగన్ పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పారడైజ్ పేపర్లలో జగన్ పేరు ఉండటంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్పందించారు.

బీజేపీతో పొత్తుపై జగన్ విమర్శలు

బీజేపీతో పొత్తుపై జగన్ విమర్శలు

తాను బీజేపీతో కలుస్తానని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు అని, కేంద్రంలో టీడీపీ వారు మంత్రులుగా ఉన్నారని, కానీ తాను ఆ పార్టీతో కలుస్తానని చెప్ప���ం విడ్డూరమన్నారు. మైనార్టీ ఓట్ల కోసమే చంద్రబాబు వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

బీజేపీతో పొత్తుపై జగన్ విమర్శలు

బీజేపీతో పొత్తుపై జగన్ విమర్శలు

తాను బీజేపీతో కలుస్తానని మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు అని, కేంద్రంలో టీడీపీ వారు మంత్రులుగా ఉన్నారని, కానీ తాను ఆ పార్టీతో కలుస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. మైనార్టీ ఓట్ల కోసమే చంద్రబాబు వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will quit from politics, says YSR Congress Party chyief YS Jagan Mohan Reddy. And He challenged Chief Minister Nara Chandrababu Naidu over Paradise papers.
Please Wait while comments are loading...