కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటా: టిజి, సిఎం కూడా

పార్టీలోని కొందరు రాష్ట్రపతిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మసాక్షిగా విభజన బిల్లుపై సంతకం పెట్టలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన రోజు తెలుగు ప్రజలకు చీకటి దినమేనని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు తమ బలం తగ్గిపోతోందని టిజి వెంకటేష్ అన్నారు.
రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లేనని వెంకటేష్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ తన పదవికి రాజీనామా వార్తలు ఊహాగానాలేనని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు.
సిగ్గుపడుతున్నా: మధుసూదన్ గుప్తా
తెల్లదొరల కంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరించారని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ వారు ఓటేస్తామంటే కాశ్మీర్‌ను కూడా ఇచ్చేస్తారేమోనని అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని గుప్తా అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దారుణంగా వ్యవహరించారని మధుసూదన్ గుప్తా ఆరోపించారు.












Click it and Unblock the Notifications