జగన్ ఇమేజ్ పెంచిన ఐఎఎస్ శ్రీలక్ష్మి
Sri Lakshmi: ఏరికోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి.. తనదైన శైలిలో పరిపాలనపై ముద్ర వేస్తోన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన మున్సిపల్ పరిపాలన శాఖలో సమర్థవంతమైన పనితీరును ప్రదర్శిస్తోన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అదే పనిగా ఆమె ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి తన క్యాడర్‌ను ఏపీకి మార్చుకున్నారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తోన్నారు. ఈ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. తాడిపత్రి మినహాయించి.. మిగిలిన మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసింది. ఆ పట్టును అసెంబ్లీ ఎన్నికల వరకూ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
వాటిని విజయవంతం చేయడంలో శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి- జగనన్న కాలనీల నిర్మాణం వెనుకా ఆమె ఐడియాలజీ ఉందనే విషయం తెలిసిందే. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావట్లేదంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో- శ్రీలక్ష్మి స్వయంగా కొన్ని మున్సిపాలిటీల్లో తనిఖీలను సైతం నిర్వహించారు.
తాజాగా- రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలను శ్రీలక్ష్మీ విజయవంతం చేయగలిగారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగియడం వెనుక ఆమె ప్రమేయం ఉంది.
గతంలో పలుమార్లు ఆమె అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ప్రతి పనినీ ఆమె ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా ఉండాలనే విషయంపైనా అధికారులకు సరైన దిశా నిర్దేశం చేయగలిగారు. తన ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకుని రాగలిగారు.
18.81 ఎకరాల స్వరాజ్ మైదాన్‌లో 400 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం, అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసే ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మాణం వెనుక శ్రీలక్ష్మీ 2,000 మంది ఒకేసారి కూర్చోవడానికి వీలుగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్, 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, ప్లే ఏరియా, వాటర్ కమ్ మ్యూజికల్ ఫౌంటెన్లు, వాకింగ్- జాగింగ్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం..ఇవన్నీ శ్రీలక్ష్మీ ఆలోచనలకు అద్దంపట్టాయి.












Click it and Unblock the Notifications