• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఐఎఎస్ అధికారులకు అనూహ్య కష్టాలు: సర్వీసులో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదంటూ

|

అమరావతి: ఐఎఎస్..ప్రతిభ గల ప్రతి ఒక్కరు కలలుగనే పోస్ట్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌లల్లో టాప్ క్యాడర్‌లో ఉండే ఈ పోస్ట్ కొడితే ఈ గ్లామరస్ లైఫ్, అంతే గ్లామరస్ శాలరీస్, సొసైటీలో ఓ పేరూ.. ఇవన్నీ సొంతమౌతాయి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి. అలాంటి ఐఎఎస్ అధికారులు కూడా అనూహ్యంగా ఆర్థికంగా కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం వేతనాల్లో కోత పెట్టడమే.

ఏడీఆర్ లేటెస్ట్ రిపోర్ట్స్: రెండో స్థానంలో వైసీపీ: టీడీపీ మరింత: రూ.100 కోట్లు ఎక్కడివి?

ఐఎఎస్‌ల వేతనాల్లో సగానికి పైగా కోత..

ఐఎఎస్‌ల వేతనాల్లో సగానికి పైగా కోత..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరులు స్తంభించిపోయాయి. వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడం వల్ల పన్నులు, ఇతరత్రా రూపంలో ఖజానాకు చేరాల్సిన నిధులు నిలిచిపోయాయి. అదే సమయంలో- సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక లోటును అధిగమించడానికి ప్రభు్తవం ఐఎఎస్ అధికారుల వేతనాల్లో కోత పెట్టింది. సగానికి పైగా తగ్గించింది. వారి మొత్తం జీతంలో 40 శాతం మాత్రమే చెల్లిస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ..

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ..

ఈ రెండు నెలల పాటూ వేతనాన్ని భరించడానికి ముందుకొచ్చిన ఐఎఎస్ అధికారులు.. ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. జీతంలో 60 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ క్యాడర్‌కు ఎంపికైన ఓ ఐఎఎస్ అధికారి తాజాగా తన ఆవేదనను వాట్సప్ ద్వారా సీనియర్లతో పంచుకున్నారని అంటున్నారు. ఇదే పరిస్థితి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని అన్ని స్థాయిల్లో పని చేస్తోన్న ఐఎఎస్‌లు ఎదుర్కొంటున్నారని, దీనికి త్వరలోనే ముగింపు పలికేలా చర్యలు తీసుకుంటామని ఆ సీనియర్ హామీ ఇచ్చారని అంటున్నారు.

 ముఖ్యమంత్రి పేషీ దృష్టికి..

ముఖ్యమంత్రి పేషీ దృష్టికి..

ఈ విషయంలో ఐఎఎస్ అధికారుల అసోసియేషన్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. వేతనాల్లో కోత పెట్టిన అంశంపై అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నేడో, రేపో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. వేతనాల్లో కోత పెట్టడం పట్ల అసోసియేషన్ తరఫున అసంతృప్తిని వ్యక్తం చేస్తారని అంటున్నారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు ఓ వినతిపత్రాన్ని అందజేస్తారని చెబుతున్నారు. వేతనాల్లో కోత పెట్టడానికి కరోనా వైరస్ ప్రభావమే కారణం అయినప్పటికీ.. ఇలా ఎన్నిరోజుల పాటు గడపాల్సి ఉంటుందనేది వారి వాదన.

  Pawan Kalyan Fan Prudhvi Tej Becomes Sub Collector
   ఏపీ ఒక్కటేనా..

  ఏపీ ఒక్కటేనా..

  కాగా.. కరోనా వైరస్ మిగిల్చిన ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఐఎఎస్ అధికారులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్రాల జాబితా పెద్దదే. ఈ జాబితాలో ఉన్నది ఏపీ ఒక్కటే కాదు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇదే వైఖరిని అనుసరిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల వేతనాల్లోనూ కోత పెట్టాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థాయి నేతలు తమ వేతనాలను వదులుకుంటున్నారు. పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు తమ జీతాన్ని ప్రధానమంత్రి కేర్‌కు పంపిస్తున్నాయి.

  English summary
  IAS Officers in Andhra Pradesh were unhappy with their pay cut upto the 60% due to the Covid-19 Coronavirus outbreak. IAS Officers Association is likely to meet General Administration Department Secretary Praveen Prakassh and submitting a memorandum regarding pay cuts.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more