AP High Court: ఆ ఇద్దరు అధికారులకు 29న శిక్ష ఖరారు

అమరావతి: కోర్టు ధిక్కరణ కింద సీనియర్ ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి ఏపీ హైకోర్టు శిక్ష ఖరారైంది. వారిద్దరికీ ఈ నెల 29వ తేదీన శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఉద్యానవన శాఖకు సంబంధించిన కొన్ని కేసుల్లో కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పూనం మాలకొండయ్యకు ఇదివరకే నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. 29వ తేదీన శిక్ష ఖరారు చేస్తామని తెలిపింది.

తమను ఉద్యోగాలను క్రమబద్దీకరించేలా, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల్లో మార్పులు చేయడం వల్ల అర్హత కోల్పోయిన కారణంతో కొందరు అభ్యర్థులు సెరికల్చర్ ఉద్యోగులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు- వారిని సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని గత ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి సకాలంలో అమలు చేయలేదు. దీనితో వారికి కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది.

IAS Poonam Malakondaiah Contempt of court row: AP HC to decide the punishment on September 29

ఈ శిక్షను ఈ నెల 29వ తేదీన ఖరారు చేయనుంది హైకోర్టు. విలేజ్‌ హార్టికల్చర్‌ పోస్టుల భర్తీకి 2020 జనవరిలో ఉద్యానవనశాఖ ఓ నోటిఫికేషన్‌‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడంతో ప్రవేశ పరీక్షను రాయడానికి తాము అర్హత కోల్పోయామని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు, నోటిఫికేషన్‌ని సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.

అధికారులు ఉత్తర్వులు ఆ అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే కేసులో తొలుత హైకోర్టు ఈ ఇద్దరు అధికారుల కు తొమ్మది రోజుల జైలు శిక్ష..జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వారిద్దరూ తమ వయసు, సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీన్ని పునఃసమీక్షించింది. అధికారులు ఉద్దేశపూరకంగా కోర్టు ఆదేశాలను ధిక్కించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. వారికి ఎలాంటి శిక్షను విధిస్తుందనేది ఈ నెల 29వ తేదీన ఖరారు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+