‘ఇచ్ఛాపురం-తడ ఆరు లైన్ల బీచ్ రహదారి’

ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు వరుసల బీచ్‌ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర ఆరు

అమరావతి: ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు వరుసల బీచ్‌ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించే ఈ రహదారికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

అంతేగాక, ఇందుకు సంబంధించి త్వరలో డీపీఆర్‌ తయారీకి ఆదేశాలిస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తామని తెలిపారు.

ichapuram to thada six line road, says Ayyannapatrudu

రహదారి వెంబడి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి వివరించారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి 60శాతం భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి డీపీఆర్‌ తయారు చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+