వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగ నియామకాల్లో తప్పును నిరూపిస్తే... మోకరిల్లుతాం, తల దించుకుంటాం : బోత్స సత్యనారాయణ

|
Google Oneindia TeluguNews

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియాకమంపై మరోసారి స్పందించారు ఏపీ పురపాలక మంత్రి బోత్స సత్యనారాయణ. ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని ఎవరైన నిరూపిస్తే... ప్రభుత్వం తలదించుకుని వారి ముందు మోకరిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు.

గ్రామ సచివాలయ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించిన నాదెండ్ల భాస్కర్ రావు .. జగన్ పై ఫైర్ గ్రామ సచివాలయ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించిన నాదెండ్ల భాస్కర్ రావు .. జగన్ పై ఫైర్

విజయనగరం జిల్లాల్లో పర్యటించిన బోత్స గ్రామసభలో మాట్లాడారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత పారదర్శకతతో వ్యవహరించిందని చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రాచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

If any one prove of fraud in recruitment we will be kneeling: Bosta satayanarayana

ఇలాంటీ అసత్య ప్రచారాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను రాజకీయ లబ్ధికోసం తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే సీఎం జగన్ ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని బోత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.

ఇటివల జరిగిన గ్రామ సచివాలయ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పరీక్ష పేపరు లీక్ అయిందని టీడీపీ పలు ఆరోపణలు చేసింది. దీంతో పాటు 5 లక్షల రుపాయలకు ఉద్యోగాలను అమ్ముకున్నారని మండిపడింది. ఈనేపథ్యంలోనే ఉద్యోగాల నియామకంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలు దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబుతో పాటు,టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.

English summary
If any one prove of fraud in recruitment of village secretariat employment The government will be kneeling before them said Bosta satayanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X