అలా ఐతే జగన్ ఓడిపోవడం ఖాయం.! రోజా చెప్పిన లాజిక్.!
అమరావతి/హైదరాబాద్: ఒక్కోసారి రాజకీయాలు చిత్రంగా పరిణమిస్తుంటాయి. రాజకీయ నేతలు మాట్టాడే మాటలు కూడా అంతకు మించి విచిత్రంగా మారుతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నేతలకన్నా అధికారంలో ఉన్న నాయకులు మాటలను కాస్త తేలిగ్గా వదిలేస్తుంటారు. అధికారంలో ఉన్నామనే ధీమా, తర్వాత ఎన్నికల్లో తామే గెలుస్తామనే భరోసా, వర్తమానంలో ఆదిపత్యంలో ఉన్న పరిస్థితుల ప్రభావంతో కాస్త విచక్షణ కోల్పోయి డైలాగ్స్ వదిలేస్తూ ఉంటారు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు. చంద్రబాబు ఎక్కెక్కి ఏడ్చిన తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపు అదే కోణంలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

కన్నీటి శాపం చాలా పవర్ ఫుల్..
అన్నిటికీ మించి పొలిటికల్ పవర్ చేతులో ఉంది కదా అనే ధీమాతో విచక్షణ లేకుండా మాటలను తూటాల్లాగా వదిలేస్తుంటారు కొంత మంది నేతలు. కొన్ని సందర్బాల్లో అవే మాటలు బూమ్రాంగ్ లా తిరుగొచ్చి తమకే తగులుతాయనే వివేకం కోల్పోవడం జరుగుతుంది. అవే వాఖ్యలు కొన్ని ప్రత్యేక సందర్బాల్లో ఆటమ్ బాంబ్ లా పేలి సంచలనంగా పరిణమిస్తుంటాయి. అధికార పార్టీలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసి అబాసుపాలైన సంఘటనలు రాజకీయాల్లో అనేకం జరుగుతాయనే చర్చ కూడా నడుస్తోంది. కొంత మంది రాజకీయకులు సంచలనం కోసం చేసే అలాంటి వ్యాఖ్యలు అధికార పార్టీకి ప్రాణసంకటంగా పరిణమించిన సందర్బాలు కూడా లేకపోలేదు.

తారా స్థాయికి చేరిన వ్యక్తిగత విమర్శలు..
రాజకీయాల్లో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి తాము ఇరుకున పడడమే మొత్తం పార్టీని సైతం ఇరుకున పెట్టిన సందర్బాలు రాజకీయాల్లో అనేకం ఉన్నాయి. సాదారణంగా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారితో ఇలాంటి పరిస్ధితులు తలెత్తుతుంటాయని సీనియర్ రాజకీయ నేతలు స్పష్టం చేస్తున్నారు. చట్ట సభల్లోకి కొత్తగా అడగుపెట్టిన వెంటనే కేంద్ర బిందువుగా మారిపోవాలని, ప్రసార మాద్యమాల ఫోకస్ తమ మీదే ఉండాలని, పార్టీ పెద్దల దృష్టిని ఆకర్శించే క్రమంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి బొక్కబోర్లా పడుతుంటారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు.

ఏడ్చారంటే ప్రత్యర్థికి ఓటమి తప్పదు..
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రెండో రోజు చోటుచేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించాయి. శాసన సభలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవచ్చుగానీ వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. రాజకీయ ఆరోపణలు శృతిమించి చేసుకున్నప్పటికీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగి నిందలు మోపడం సమంజసం కాదను అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. నిండు శాసన సభలో చోటుచేసుకున్న పరిణామాల పట్ల సీనియర్ రాజకీయ నాయకుడుగా కలత చెంది సభ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎక్కెక్కి ఏడ్చిన చంద్రబాబు పట్ల నగరి ఎమ్మెల్యే రోజా స్పందించిన తీరు ఆ పార్టీని ఇరుకున పెట్టడమే కాకుండా పార్టీ ఓడిపోతుందనే సంకేతాలనిచ్చారు.

రోజా ఏడ్చింది బాబు ఓడారు.. ఇప్పుడు బాబు ఏడ్చారు..
2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి పీతల సుజాతను తన మీదకు ఉసిగొల్పి, తప్పుడు ఆరోపణలతో, తప్పుడు సీడిలతో తనను మనోవేదనకు చంద్రబాబు గురి చేసారని, తాను కార్చిన కన్నీళ్ల శాపం కారణంగానే చంద్రబాబు ఘోరంగా ఓడిపాయరని రోజా స్పష్టం చేసారు. అంటే తాను ఏడ్చింది కాబట్టి, ఆ ఏడుపు శాపం చంద్రబాబుకు తగిలి ఆయన ఓడిపోయారని రోజా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా ఎక్కెక్కి ఏడ్చారు కదా.! వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారా.? రోజా చెప్పిన లాజీక్ ప్రకారం ఐతే వచ్చే ఎన్నికల్లో జగన్ తప్పకుండా ఓడిపోవాలి. చంద్రబాబు ఏడుపు శాపం తగిలి వైసీపి ఓడిపోతుంది. ఇదే కదా నగరి ఎమ్మెల్యే రోజా చెప్పకనే చెప్పిన జగన్ ఓటమి లాజిక్.. యస్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications