మైనార్టీలకు డిప్యూటీ సీఎం, వడ్డీలేని రుణం : ఏపీ సీఎం చంద్రబాబు వరాలు
కడప : పోలింగ్ సమయం సమీపిస్తోన్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు ప్రకటిస్తున్నారు నేతలు. మేనిఫెస్టోలో ఇచ్చే హామీలే గాక .. కీలక పథకాలను ప్రకటిస్తూ ముందుకుసాగుతున్నారు. కర్నూలు జిల్లా అలూరు సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీలకు వరాల జల్లు కురిపించారు.

మైనార్టీలకు డిప్యూటీ సీఎం
టీడీపీని ఆశీర్వదించి తిరిగి గెలిపించాలని అలూరు సభలో మైనార్టీలను కోరారు చంద్రబాబు. తమను గెలిపిస్తే మైనార్టీ సంక్షేమం కోసం పాటుపడతానని ఉద్ఘాటించారు. మైనార్టీ నేతకు డిప్యూటీ సీఎం పదవీ ఇస్తామని హామీనిచ్చారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం టీడీపీ కృషి చేస్తుందని గుర్తుచేశారాయన.

వడ్డీలేని రుణం .. ఇస్లామిక్ బ్యాంకు
డిప్యూటీ సీఎం పదవే కాదు మైనార్టీలకు వడ్డీలేని రుణం ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఇందుకోసం వారికి ఇస్లామిక్ బ్యాంకు నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇవాళ శుక్రవారం పవిత్రమైన రోజు .. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకొని టీడీపీకి మద్దతు తెలుపాలని కోరారు చంద్రబాబు

మోదీ, జగన్‌పై విసుర్లు
ప్రధాని మోదీ, విపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. మైనార్టీలకు మోదీ మోసం చేశారని ఆరోపించారు. అలాంటి వారికి జగన్ వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. జగన్ కు ఓటేసినా .. మోదీకి వేసినట్లవుతోందని గుర్తుచేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications