మేం తాళపత్రాలు తీస్తే బయటపడేది మీ పాపాలే .. నోటికి తాళం వేసుకోండి... వార్నింగ్ ఇచ్చిన బుద్దా
చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు.శ్వేతపత్రాలు నుద్దేశించి అది బోగస్ పత్రాలు అని చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని విజయసాయి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు బుద్దా వెంకన్న .
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ లో మాటలయుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే . చంద్రబాబు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా, చివరికి తాళపత్రాలు విడుదల చేసినా ఆయన్ను ప్రజలు నమ్మరన్న వ్యాఖ్యలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. విజయసాయికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు .చంద్రబాబు హయాంలో అప్పు ఇస్తామని ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంలేక వెనక్కు పోతున్నాయని విమర్శించారు. ఇక నమ్మకం ఎవరి మీద ఎవరికుందో విజయసాయి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీలో ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి ఉందో ప్రస్తుతం దేశానికి అంతా తెలుసని పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న . 'బహుశా మీ నాయకుడి(జగన్)పై, మీపై ఉన్న సీబీఐ కేసు పత్రాలు చదివి ఉంటారేమో! ఇంకా వేరే పత్రాలు మీకేం తెలుసు .. మేము నిజంగానే మీ తాళపత్రాలు విడుదల చేస్తే అందులో మీ తాతలనాటి నుంచి మీ వరకు మీరు చేసిన మోసాలు, పాపాలు బయటపడతాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . కాబట్టి మీ నోటికి తాళం వేసుకు కూర్చుంటే మంచిది అని హితవు పలికారు బుద్దా వెంకన్న . ఒకర్ని మించి ఒకరు డోస్ పెంచి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు వైసీపీ , టీడీపీ నాయకులు .












Click it and Unblock the Notifications