విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ సంబంధమే హత్యకు కారణం: కత్తులతో దాడి చేసి చంపారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నానికి చెందిన రౌడీ షీటర్ పట్నాల సంతోష్ కుమార్ హత్యకేసులో నిందితులను మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. జిల్లా పరిషత్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్-2 డీసీపీ రామ్ గోపాల్ నాయక్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు.

ఈకేసులో ప్రధాన నిందితుడు, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిది రెడ్డివీధికి చెందిన గరుగుబల్లి హరీష్, అలియాస్ కప్పడు భార్యతో సంతోష్ కుమార్‌కు గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది.

దీంతో సంతోష్‌ను ఎలాగైన మట్టుబెట్టాలని హరీష్ ఓ పథకం రచించాడు. తన స్నేహితులైన చొప్పా హేమంత్ కుమార్, కుప్పిలి సునీల్ అలియాస్ కోటా రెడ్డి, కర్రి సంతోష్ అలియాస్ పందులోడు, మోర్సా రాజశేఖర్, గొందేసి ధనరెడ్డిలకు ఈ విషయం వివరించాడు.

అక్రమ సంబంధమే హత్యకు కారణం

అక్రమ సంబంధమే హత్యకు కారణం

ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంతోష్ రామకృష్ణాపురం, సెయింట్ జోసెఫ్ స్కూల్ రోడ్డులో ఆటో నడుపుకుంటూ ఇంటికి వెళుతున్నాడు. చంద్రమ్మ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చే సరికి అతని ఆటోకు గొందేసి ధనరెడ్డి ఆటోలో వచ్చిన వీరంతా అడ్డుతగిలారు.

అక్రమ సంబంధమే హత్యకు కారణం

అక్రమ సంబంధమే హత్యకు కారణం


సంతోష్ ఆటో నుంచి బయటకు దిగగానే వారంతా ఒక్కసారిగా కత్తులతో అతనిపై దాడి చేశారు. ఛాతీపై, పొట్టలో పొడవడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.

అక్రమ సంబంధమే హత్యకు కారణం

అక్రమ సంబంధమే హత్యకు కారణం

ఇంతలో విషయం తెలుసుకున్న సంతోష్ తల్లి ఘటనా స్థలానికి చేరుకొని, మరో ఆటోలో కేజీహెచ్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు పట్నాల మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అక్రమ సంబంధమే హత్యకు కారణం

అక్రమ సంబంధమే హత్యకు కారణం

ఈ క్రమంలో నిందితులు 48వ వార్డు మాజీ అధ్యక్షుడు ఉరుకూటి డేవిడ్, వీఆర్‌ఓ కె.సంజీవ్ కుమార్ సహకారంతో శనివారం మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Illegal affair with woman led to rowdy sheeter killing in Visakhapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X