ఏపీ ప్రజలకు ఐఎండీ అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమయిన అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఇప్పడు వాతావరణ శాఖ ఏపీకి చల్లటి కబురు అందించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అయితే నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా భావిస్తోంది. అలాగే మిగిలిన జిల్లాల్లో మోసర్తు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

నేడు, రేపు భారీ వర్షాలు..
ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా వ్యాపించినా పలుజిల్లాల్లో మాత్రం వాతావరణం ఇంకా చల్లబడలేదు. అయితే వచ్చే రెండు, మూడు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. నేటి నుంచి జూన్ 27వ తేదీ వరకు అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 26, 27 తేదీల్లో కోస్తాలో ఎక్కువచోట్ల వానలు, ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
అయితే పలు ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడా ఎండలు కొనసాగుతాయని అంటున్నారు. అలాగే మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications