రుతువపనాలు వచ్చాయి, కానీ - అరెంజ్ అలర్ట్ , లేటెస్ట్ అప్డేట్..!!
ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తరించకుండా ఉసూరనిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని వాతావణ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ రోజు..రేపు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ..అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాహం లేకపోయినా మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది.
నిప్పుల కొలిమిలా:జూన్ మూడోవారంలోనూ వాతావరణం.. నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రుతుపవనాల విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉక్కపోత కూడా ప్రజలను పెడుతోంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ అందించింది.

సోమవారం, మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని..ప్రమత్తంగా ఉండాలని కోరింది. నేడు, రేపు ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను చేరే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. వాస్తవానికి తమిళనాడు, కేరళ తీరాన్ని ఈ నెల 8-9 తేదీల్లోనే తాకాయి. 10వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీలోని రాయలసీమకు విస్తరించాయి. ఆ వెంటనే తెలంగాణకు రావాలి. కానీ, అక్కడినుంచి వాటి పురోగతి లేదు.
విస్తరించని రుతుపవనాలు:ఏపీలోకీ ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. ఆ రాష్ట్రమంతా విస్తరించకుండా ఉసూరనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు సోమవారం రుతుపవనాలు విస్తరిస్తాయని ఏపీలోని వాతావరణ శాఖ తొలుత ప్రకటించింది.
కానీ, వాతావరణంలో అనుకూల మార్పులు లేనందున మరో రెండు, మూడు రోజుల్లో పురోగతి ఉంటుందని తాజాగా పేర్కొంది. సజావుగా సాగితే జూలై 5 నాటికి దేశమంతా విస్తరించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో దక్షిణ భారతంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం పూర్తిగా బలహీనమై, తర్వాత రెండు, మూడు రోజులకు గానీ ఏపీలో నైరుతి బలపడదని చెబుతున్నారు.
రెండు రోజులు అప్రమత్తం:ఈ రోజు, రేపు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఎండలతోపాటు వేడి తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించింది. అలాగే వేడిగాలులు బలంగా వీస్తాయని అప్రమత్తం చేసింది.
ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను చేరే ఛాన్స్ ఉందని తెలిపింది పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కెళ్లపల్లిలో ఆదివారం అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మల్యాలపల్లి, అకినపల్లిలలో 44.4 డిగ్రీలు, జంబుగల (ఆసిఫాబాద్)లో 44.5, నేలకొండపల్లి (ఖమ్మం)లో 44.3, కుంచెవెల్లిలో (ఆసిఫాబాద్) 44, నేరేళ్లలో (జగిత్యాల) 43.9, యానంబైలు (భద్రాద్రి కొత్తగూడెం)లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో మరో రెండు రోజులు ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు..ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications