కుండపోత, మరో నాలుగు రోజులు - ఏపీలో ఈ ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలు వర్షాలు దంచి కొడుతున్నాయి. ముందస్తు రుతుపవనాలు.. బంగాళాఖాతం లో అల్ప పీడన ద్రోణి తో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తెలంగాణతో పాటుగా ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారీ వర్షాలు
రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి ఉత్తర ఒడిశా, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్రమట్టానికి 1.5 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ భారత దేశంతో పాటు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రుతుపవనాలతో
మే 31, లేదా జూన్ 1 న ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ రాయలసీమలోకి ప్రవేశించనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా హెచ్చరిక
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్. గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం విషయానికొస్తే అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
-
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications