ఉపరితల ఆవర్తనం - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమో దు అవుతున్నాయి. 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. ఇదే సమయంలో భారీ వర్షాల పైన వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలతో పాటుగా వర్షాల పైన ఐఎండీ అలర్ట్స్ ఇచ్చింది. అదే సమయంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది బంగాళాఖాతం లో ఉత్తరం వైపుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్ల డించారు. జూన్ 9, సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపు లతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలో ఉక్కపోత తీవ్రత అధికంగా ఉండగా... కర్నూలు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నరసాపురంలో 41 డిగ్రీలు, అదే విధంగా ఒంగోలు, నెల్లూరు, కావలిలలో 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఖమ్మం, రామగుండంలో గరిష్టంగా 40.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 35°C నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేసింది. ఆదివారం అనకాపల్లిలో 5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 41°C వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications